భూకంపాలు తట్టుకునేలా రాజధాని, హైదరాబాద్ చూశారుగా!: బాబు

రాజమండ్రి: భూకంపాలు, సునామీలు తట్టుకునేలా రాజధాని నిర్మాణం ఉంటుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం చెప్పారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సీడ్ కేపిటల్‌ను చంద్రబాబుకు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

అమరావతి రాజధాని నిర్మాణంలో భాగస్వామి కావాలని సింగపూర్‌ను కోరామన్నారు. 2018లోగా రాజధాని నిర్మాణం తొలి దశ పూర్తి అవుతుందన్నారు. రాజమండ్రిని పర్యాటక కేంద్రం అభివృద్ధి చేస్తామని చెప్పారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో నిర్మాణాలు చేపడతామన్నారు.

అక్టోబర్ 22న రాజధానికి శంకుస్థాపన చేస్తామన్నారు. ప్రజా రాజధానిని నిర్మించి తీరుతామన్నారు. నిర్ణీత సమయానికి ప్రణాళిక ఎలా చేయాలో సింగపూర్ నిరూపించిందని, అనుకున్న సమయానికి ఎలా పూర్తి చేయాలో సింగపూర్‌ను చూసి నేర్చుకోవాలన్నారు. డబ్బులతోనే అన్ని పనులు పూర్తి కావాని తెలుసుకోవాలన్నారు.

Earthquake resistant structures in Amaravati: Chandrababu

ఒక్క పైసా తీసుకోకుండా రైతులు భూములు ఇవ్వడమే అందుకు నిదర్శనం అన్నారు. ప్రభుత్వం పైన, తన పైన విశ్వాసంతో రైతులు తమ భూములు ఇచ్చారన్నారు. తక్కువ భూమిలో ఎక్కువ భవనాలు నిర్మిస్తామన్నారు. భూకంపాలు, సునామీలు తట్టుకునే సామర్థ్యంతో భవనాలు నిర్మిస్తామన్నారు.

రాజధాని అమరావతిలోనే ఉంటూ తాను పనులు పూర్తి చేయిస్తానని చెప్పారు. రాజమండ్రిని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూనే మోడర్న్ సిటీని నిర్మిస్తామన్నారు.

అలైన్మెంటులో ఇప్పటి వరకు పెద్దగా మార్పులు చేయలేదని చెప్పారు. ఇప్పటికే భూసమీకరణ జరిగిందని, కొంతమంది రాజకీయం చేయాలనుకుంటే, చట్టపరంగా భూసేకరణ చేస్తామని చెప్పారు. ఎవరికీ నష్టం చేయకుండా తాము ముందుకు పోతామన్నారు.

రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకారం కూడా తీసుకుంటామన్నారు. రైతుల భూమికి విలువ వచ్చేలా, రైతులు కూడా సంతృప్తి చెందేలా ముందుకు పోతామన్నారు.

హైదరాబాదును నేను అభివృద్ధి చేసి లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేలా చేశానని, కానీ ఎక్కడా అవకతవకలు జరగలేదన్నారు. అమరావతి అభివృద్ధికి భాగస్వామిని ఎంపిక చేయవలసి ఉందన్నారు. కాగా, మన స్నేహం సుదీర్ఘ కాలం ఉంటుందని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+