తొక్కిసలాటపై కలెక్టర్ రిపోర్ట్, జియోగ్రఫిక్ ఛానల్ షూటింగ్ కోసం: బాబుపై జ్యోతుల తీవ్ర వ్యాఖ్య
రాజమండ్రి: తూర్పు గోదావరి రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట పైన మానవ హక్కుల కమిషన్‌కు, సిఎస్ ద్వారా కేంద్ర హోంశాఖకు నివేదిక పంపించినట్లు జిల్లా కలెక్టర్ గురువారం చెప్పారు.
ఒక్కసారిగా భక్తులు తోసుకు రావడంతో తొక్కిసలాట జరిగిందని, పోలీసులు నియంత్రించలేని పరిస్థితి ఏర్పడిందని నివేదికలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. మంగళవారం కావడంతో భక్తులు తక్కువగా ఉంటారని భావించామని, కానీ చాలామంది వచ్చారని చెప్పారని తెలుస్తోంది. పోలీసుల వైఫల్యం కూడా ఉందని చెప్పారని సమాచారం.
కాగా, తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాల ఘనంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు భక్తులు మరింత పెరిగారు. గోదావరి పుష్కర శోభాయాత్ర రాజమండ్రి కోటిపల్లి బస్టాండుకు చేరుకుంది. తిరుమల నుంచి భక్తులు శోభాయాత్రగా కాలినడకతో వచ్చారు. ఈ శోభాయాత్రకు చంద్రబాబు స్వాగతం పలికారు.

గోదావరి పుష్కరాలు
లుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాల ఘనంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు భక్తులు మరింత పెరిగారు. గోదావరి పుష్కర శోభాయాత్ర రాజమండ్రి కోటిపల్లి బస్టాండుకు చేరుకుంది.

గోదావరి పుష్కరాలు
తిరుమల నుంచి భక్తులు శోభాయాత్రగా కాలినడకతో భక్తులు కోటిపల్లి బస్టాండుకు వచ్చారు. ఈ శోభాయాత్రకు చంద్రబాబు స్వాగతం పలికారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి రాజమండ్రిలోని వెంకటేశ్వర స్వామి నమూనా ఆలయంలో పూజలు చేశారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి రాజమండ్రిలోని వెంకటేశ్వర స్వామి నమూనా ఆలయంలో పూజలు చేశారు. ప్రసాదం తీసుకుంటున్న దృశ్యం.

గోదావరి హారతి
గోదావరి పుష్కరాలు 2015 నేపథ్యంలో మంగళవారం రాత్రి గోదావరి తల్లికి హారతి ఇస్తున్న దృశ్యం.ం
ఇదిలా ఉండగా, వైసీపీ నేత జ్యోతుల నెహ్రూ ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు తన బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలని తహతహలాడారన్నారు. అందుకే, విఐపి ఘాట్ కానప్పటికీ కోటగుమ్మం ఘాట్లో పూజలు నిర్వహించారన్నారు.
అదే సమయంలో పబ్లిసిటీ కోసం జనాన్ని ఆ ఘాట్ వైపు మళ్లించారన్నారు. పుష్కరాలపై ప్రత్యేక కథనాన్ని చిత్రీకరిస్తున్న నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ షూటింగ్‌లో చంద్రబాబు పాల్గొన్నారని, దాని కోసమే భక్తులను గంటసేపు వేచి చూసేలా చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం బంపరాఫర్ - తాజా గడువు, మార్గదర్శకాలు..!! -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం










Click it and Unblock the Notifications