టిడిపి నేత కూతురు దారుణ హత్య: ప్రేమ వ్యవహారమే కారణమా?
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో దారుణం జరిగింది. రామచంద్రాపురం టిడిపి అధ్యక్షులు నందులరాజు కూతురు జయదీపికను దుండగులు హత్య చేశారు.
రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో దారుణం జరిగింది. రామచంద్రాపురం టిడిపి అధ్యక్షులు నందులరాజు కూతురు జయదీపికను దుండగులు హత్య చేశారు.
దీపిక హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు కత్తితో పొడిచి చంపినట్లుగా భావిస్తున్నారు.

రాత్రి ఒంటిగంట సమయంలో ఇంటికి వెళ్లిన నందుల రాజు.. కూతురు విగతజీవిగా ఉండటాన్ని చూశారు. హత్యకు గురైన జయదీపిక మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారు. జయదీపిక సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications