ఆఫీసులో నారా లోకేష్ చేతికి రూ.50వేల చెక్ (ఫోటో)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధికి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంకు చెందిన అల్లూరి రామభద్ర వర్మ రూ.50వేల విరాళం ఇచ్చారు. ఈ మొత్తాన్ని ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్‌కు బుధవారం ఎన్టీఆర్ భవన్‌లో చెక్‌ను అందజేశారు.
కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే తేడా లేకుండా తాము పార్టీ కార్యకర్తలను ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ వారం రోజుల క్రితం చెప్పిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ సమన్వయకర్తగా లోకేష్ హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో లోకేష్ ఆ రోజు బాధ్యతలు స్వీకరించారు.

నారా లోకేష్ తొలుత స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రతి టిడిపి కార్యకర్తకు నూటికి నూరు శాతం సంక్షేమ నిధి ద్వారా న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కార్యకర్తలకు ప్రతి నిమిషం అందుబాటులో ఉంటానని చెప్పారు. ఎపి, టి అనే తేడా లేకుండా కార్యకర్తలను ఆదుకుంటామన్నారు. చంద్రబాబు బాధ్యతలు స్వీకరించే సమయానికే ఆయన కుమారుడు నారా లోకేశ్.. పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో కార్యకర్తల సంక్షేమ నిధికి సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించారు.
-
1,01,001 బియ్యపు గింజలపై "రామ" నామం..! -
వీళ్లా ఆలయ అధికారులు.. శ్రీరామనవమి నాడే "అశ్లీల నృత్యాల" బాగోతం !! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications