రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది - ఛాన్స్ దక్కేదెవరికి, లిస్టులో..!!
రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల సంఘం ఏపీలో 3, తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల సమరానికి ముందే ఈ ఎన్నికలు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఏపీలో మూడు స్థానాలు దక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. దీని ద్వారా టీడీపీ రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోనుంది. దీనికి చంద్రబాబు కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. దీంతో, ఈ ఎన్నికల పోరు ఆసక్తి కరంగా మారుతోంది.
షెడ్యూల్ ప్రకటన: ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల కంటే ముందు రాజ్యసభ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించింది. ఏపీలో మూడు స్థానాలు, తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ జారీ కానుంది.

15వ తేదీ నామినేషన్లకు చివరి రోజు. 16న నామినేషన్లను పరిశీలన చేయనున్నారు. 20వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ప్రకటించారు. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 29వ తేదీ లోగా పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
జగన్ వర్సస్ చంద్రబాబు: ఏపీ నుంచి వైసీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్ పదవీ విరమణ చేయనున్నారు. వీరి స్థానంలో మరో ముగ్గురి ఎంపిక కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అసెంబ్లీలో సంఖ్యా బలం ప్రకారం మూడు సీట్లు ప్రస్తుతానికి వైసీపీకి దక్కే అవకాశం కనిపిస్తోంది.
ముగ్గురు అభ్యర్దులు గెలవాలంటే ఒక్కే రాజ్యసభ అభ్యర్దికి 58 ఓట్లు కావాల్సి ఉంటుంది. ఇక, ఇప్పుడు ఏపీలో రెండు పార్టీల నుంచి 9 మంది పైన అనర్హత పిటీషన్లు పెండింగ్ లో ఉన్నాయి. గంటా రాజీనామా ఆమోదించారు. దీంతో ఈ పది మంది పైన స్పీకర్ నిర్ణయం తీసుకుంటే సభలో సంఖ్య బలం 165కి చేరుతుంది. అప్పుడు ఒక్కో రాజ్యసభ సభ్యుడు గెలవాలంటే 55 మంది చొప్పున మద్దతు అవసరం.
ఛాన్స్ దక్కేదెవరికి: వైసీపీ లో సీట్లు దక్కక బయటకు వచ్చిన వారిని కలుపుకొని ఒక సీటు దక్కించుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఆ అవకాశం టీడీపీకి లేకుండా రాజ్యసభలో తొలి సారి టీడీపీని జీరో చేసేలా వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలోనే ఇప్పుడు స్పీకర్..హైకోర్టు కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
వైసీపీ నుంచి రాజ్యసభకు కొత్తగా వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, అరణి శ్రీనివాసులకు అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. దీని ద్వారా రెడ్డి, ఎస్సీ, బలిజ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రాజ్యసభ ఎన్నికల్లో పై చేయి సాధించటం ద్వారా ప్రత్యర్ధి పైన నైతిక విజయం సాధించే క్రమంలో సీఎం జగన్..చంద్రబాబు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్దం అవుతున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications