ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులకు ఈసీ శుభవార్త.. 14న పండగ చేస్కోండి!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఈసీ శుభవార్త చెప్పింది. మే 13వ తేదీన ఎన్నికల పోలింగ్ తరువాత మరుసటి రోజున మే 14న ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్ సౌకర్యాన్ని కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. మే 14న (ఆన్ డ్యూటీ) క్యాజువల్ లీవ్ గా ప్రకటించారు.
ఉద్యోగులకు ఈసీ శుభవార్త
ఈనెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల విధుల్లో సిబ్బంది బిజీగా ఉన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించిన సిబ్బంది మళ్లీ వెంటనే విధుల్లో యాక్టివ్ గా పని చేయలేరని భావించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు మే 14వ తేదీ మంగళవారం నాడు ప్రత్యేక క్యాజువల్ లీవ్ (ఆన్ డ్యూటీ)గా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు పేర్కొంది.

లీవ్ శాంక్షన్ చేసే అధారిటీలు చర్యలు తీసుకోండి
ఈ మేరకు సంబంధిత లీవ్ శాంక్షన్ చేసే అధారిటీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలు జారీ చేశారు. ఏపీ ఎన్జీవో, ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఈవో తెలిపారు. ఏపీ ఎన్నికలలో పోలింగ్ విధులను నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందికి ఈనెల 14వతేదీన ప్రత్యేక క్యాజువల్ లీవ్ వర్తిస్తుందన్నారు.
రిజర్వుడ్ సిబ్బందికి వర్తించదు
రాష్ట్రవ్యాప్తంగా కార్యదర్శులు, శాఖధిపతులు, జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు సంబంధిత లీవ్ ఇచ్చే అథారిటీలకు ఈ ఆదేశాలను సర్క్యులేట్ చేసి పోలింగ్ విధులు నిర్వహించిన వారికి ప్రత్యేక క్యాజువల్ లీవ్ సౌకర్యం కల్పించాలన్నారు. అయితే ఈ ప్రత్యేక క్యాజువల్ లీవ్ సౌకర్యం పోలింగ్ విధుల కోసం కేటాయించిన రిజర్వుడు సిబ్బందికి వర్తించదని పేర్కొన్నారు.
పోలింగ్ ముగిశాక డ్యూటీ సర్టిఫికెట్లు ... వారికి ప్రత్యేక క్యాజువల్ లీవ్
పోలింగ్ విధుల కోసం రిజర్వుడు సిబ్బంది గా నియమించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఇతర పోలింగ్ సిబ్బందికి ఈ ప్రత్యేక క్యాజువల్ లీవ్ వర్తించదని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. రేపు పోలింగ్ ముగిసిన తర్వాత రిసెప్షన్ కేంద్రంలో పోలింగ్ సామాగ్రిని అప్పగించిన తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్లకు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు, ఓపిఓలకు డ్యూటీ సర్టిఫికెట్లను జారీ చేసి వీరికి 14వ తేదీన ప్రత్యేక క్యాజువల్ లీవ్ వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పించాలని సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications