టీడీపీకి బిగ్ షాక్- భూహక్కుచట్టంపై దుష్ప్రచారం-సీఐడీ చర్యలకు ఈసీ ఆదేశాలు..!
ఏపీలో భూహక్కు చట్టంపై ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా టీడీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ వైసీపీ చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ఇవాళ చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై చేస్తున్న ప్రచారంపై టీడీపీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఐవీఆర్ ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈసీకి అంతకు ముందు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ కు విరుద్దంగా టీడీపీ ప్రచారం చేస్తున్నట్లు గుర్తించిన ఈసీ.. సీఐడికి ఆదేశాలు ఇచ్చింది.

ఏపీలో వైసీపీ సర్కార్ గతంలో అసెంబ్లీలో ఆమోదించిన భూహక్కు చట్టం ద్వారా ప్రజల భూములు లాక్కుంటారంటూ విపక్ష ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ప్రచారం చేస్తోంది. అదే సమయంలో టీడీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఇదే అంశాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్తోంది. ఇందులో నిర్ధారణ కాని విషయాలు ఉన్నాయని, అవాస్తవాలు ఉన్నాయని వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఈసీ.. వైసీపీ వాదనతో ఏకీభవించింది.
ఈ మేరకు రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి హరేంధ్రప్రసాద్ ఇవాళ సీఐడీ అదనపు డీజీకి టీడీపీ దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అవాస్తవాలతో జరుగుతున్న ఈ ప్రచారంపై సీఐడీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. దీంతో సీఐడీ ఇప్పుడు ఐవీఆర్ఎస్ కాల్స్ పై చర్యలకు సిద్దమవుతోంది. అయితే నేరుగా చంద్రబాబు, పవన్ ఈ చట్టంపై చేస్తున్న విమర్శల ప్రస్తావన ఇందులో ఎక్కడా లేదు.












Click it and Unblock the Notifications