ఏపీలో మొత్తం 3.99 లక్షల ఓటర్లు.. తుది జాబితా విడుదల చేసిన ఈసీ
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల సంఖ్య పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సవరించిన తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. ఆ లెక్కల ప్రకారం ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 99 లక్షల 37 వేల 394 మందిగా తేలింది. అదులో పురుష ఓటర్లు కోటీ 97 లక్షల 21 వేల 514 కాగా.. మహిళా ఓటర్లు 2కోట్ల 2 లక్షల 4 వేల 378 మంది అని వెల్లడైంది.
ఎన్‌ఆర్‌ఐ, ట్రాన్స్‌జెండర్లు..
సవరించిన ఓటర్ల జాబితాలో విడివిడిగా పురుషులు, మహిళల సంఖ్యతోపాటు ట్రాన్స్‌జెండర్ ఓటర్ల సంఖ్యను కూడా ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఏపీలో ట్రాన్స్‌జెండర్ ఓటర్ల సంఖ్య 4,066గా నమోదైంది. ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 7,436 ఉన్నారని ఈసీ తెలిపింది. ముసాయిదా జాబితా తర్వాత కొత్తగా లక్షా 63 వేల 30 మంది ఓటర్లు నమోదయ్యారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ వెల్లడించారు.

పకడ్బందీ ఏర్పాటలు..
మార్చి 15లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లలో నిమగ్నమైంది. స్థానిక సంస్థల ఎన్నికలకు మొత్తం 45,836 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు విజయానంద్ తెలిపారు. అటు రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికలో తనమునకలయ్యాయి.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications