అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌లా జైలు కోరిక లేదు, జఫ్తు ఆస్తులివే.. చూడండి: లోకేష్

|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఈడీ రూ.749 కోట్ల ఆస్తులను జఫ్తు చేయడంపై టిడిపి నేత నారా లోకేష్ గురువారం నాడు స్పందించారు. అదే సమయంలో సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో ఈడీ ప్రెస్ రిలీజ్ కాపీను కూడా ఉంచారు.

lokesh-jagan

లోకేష్ మాట్లాడుతూ.. జగన్‌లా తనకు జైలుకు వెళ్లాలన్న కోరిక లేదన్నారు. విజయవాడలో ఉదయం పేదలకు రేషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. పేద ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వైసిపి నేతలు ఓర్వలేకే తమ పైన ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఈడీ షాక్, మారిన జగన్ ముఖం: 750కోట్లు కాదు.. వేలకోట్లే!

అవినీతిపరులైన రాజకీయ నాయకులు వారి అర్హత కలిగిన చోటకు వెళ్తారని ట్వీట్ చేశారు. దానికి ఈడీ కాపీని పెట్టారు. తద్వారా, జగన్ జైలుకు వెళ్తాడని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, జగన్‌కు చెందిన పలు ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

లోటస్ పాండ్‌తో సహా 749 కోట్ల ఆస్తుల అటాచ్: మాట్లాడేందుకు జగన్ నిరాకరణ

ఈడీ అటాచ్ చేసిన ఆస్తులివే..

- బెంగళూరులోని కామర్స్‌ అట్‌ మంత్రి వాణిజ్య సముదాయం రూ.49.46 కోట్లు
- గుంటూరులోని సరస్వతి పవర్స్‌కు చెందిన 903.28 ఎకరాల భూమి రూ.31.84 కోట్లు
- హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌ హౌస్‌ రూ.56.89 కోట్లు
నివిష్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రయివేట్ లిమిటెడ్‌కు చెందిన రంగారెడ్డి జిల్లా కాటేదానలోని సర్వే నెం. 101/ఈలోని 9680 చదరపు గజాల స్థలం రూ.8.11 కోట్లు
- రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, సర్దార్‌ నగర్ రెవెన్యూ గ్రామంలోని సర్వే నెం. 10/2, 11/2, 18/1, 19/1, 20లో ఇనస్పైర్‌ హోటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన 32 ఎకరాల 31 గుంటల స్థలం రూ. 6.46 కోట్లు
- బెంగళూరు దేవనహళ్లి తాలుకా చెన్నరాయపట్న హుబ్లి, నల్లూరు గ్రామంలోని రేవలన ఇనఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన 9 ఎకరాల స్థలం రూ.6.79 కోట్లు
- భగవత సన్నిధి ఎస్టేట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన వర్తూర్‌ హుబ్లి, దేవరబీసనహళ్లి
గ్రామంలోని సర్వే నెం. 55/1లోని 59,070 చ.అ. స్థలం రూ.2.64 కోట్లు
- బంజారాహిల్స్‌ రోడ్ నెంబర్ 1 సాక్షి టవర్స్ రూ.43.70 కోట్లు
- మార్వెల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రయివేటు లిమిటెడ్‌కు చెందిన అన్ని ఆస్తులు రూ.1.53 కోట్లు
- బెంగళేరులోని హరోహళ్లిలో సర్వే నెంబరు 195లోని 1ఎకరం 30 గుంటలు 9.06 కోట్లు
- సిలికాన ఇనఫ్రాస్ట్రక్చర్‌ ప్రయివేట్ లిమిటెడ్‌ ఆస్తులు రూ.6.54 కోట్లు
- సండూర్‌ పవర్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన స్థలం, భవనాలు రూ.118.49 కోట్లు
వైయస్ భారతి పేరు మీద రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని సర్వే నెంబరు 79/పి, 80/2లో ఉన్న 2500.69 చదరపు గజాల స్థలం రూ. 1.36కోట్లు
- ల్యాంకో హిల్స్‌లోని జెల్లా జగన్‌ పేరిట ఉన్న ఫ్లాట్ రూ. 1.30 కోట్లు
- కడప జిల్లా సెట్టిగుంట గ్రామంలోని సర్వేనెం లోని 2588లో జెల్లా జగన పేరిట ఉన్న స్థలం 27 ఎకరాలు రూ.0.15 కోట్లు
- భారతీ సిమెంట్స్‌లో జగన్‌ పేరిట ఉన్న 2,38,06,435 ఈక్విటీ షేర్లు రూ.23.80 కోట్లు
- భారతి సిమెంట్సులో సిలికాన బిల్డర్స్‌కు ఉన్న 1,50,00,000 ఈక్విటీ షేర్లు రూ.15 కోట్లు
- సండూర్‌ పవర్‌ కంపెనీలో జగన్‌ పేరిట ఉన్న 1,66,44,083 ఈక్విటీ షేర్లు రూ.88.07 కోట్లు
- క్లాసిక్‌ రియాల్టీ ప్రయివేటు లిమిటెడ్‌లో వైఎస్‌ జగన్ పేరుతో ఉన్న 88,103 ఈక్విటీ షేర్లు రూ.65 కోట్లు
- సిలికాన బిల్డర్స్‌లో జగన్‌కు ఉన్న 2,58, 181 రూ.2.86కోట్లు
- సిలికాన ఇన్ ఫ్రా పేరిట సండూర్‌ పవర్‌ కంపెనీలో ఉన్న షేర్లు రూ.2.86 కోట్లు
- సండూర్‌ పవర్‌ కంపెనీకి చెందిన 1,24,500 రిలయన్స్‌ ఇండస్ట్రీస్ షేర్లు రూ.9.82 కోట్లు
- సండూర్‌ పవర్‌ కంపెనీకి చెందిన 1,05,000 ఎన్‌ఎండీసీ ఈక్విటీ షేర్లు రూ.1.23 కోట్లు
- సండూరు పవర్‌కు చెందిన 70 వేల కెయిర్న్‌ ఇండియా లిమిటెడ్‌ షేర్లు రూ.2.01 కోట్లు
- భారతి పేరున ఉన్న క్లాసిక్‌ రియాలిటీ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన రూ.100 విలువ గల 6897 షేర్లు రూ.5.10 కోట్లు
- భారతీ సిమెంట్‌కు చెందిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు రూ.152.8 కోట్లు
- భారతి పేరున ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు రూ.15.84 కోట్లు
- భగవతి సన్నిధి ఎస్టేట్స్‌ పేరున ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు రూ.0.98 కోట్లు
- సిలికాన్ బిల్డర్స్‌ ప్రయివేటు లిమిటెడ్‌ పేరున ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు రూ.0.77 కోట్లు
- సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్ ప్రయివేట్ లిమిటెడ్‌కు చెందిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు 49.56
మొత్తం రూ 0.50 కోట్లు

English summary
Nara Lokesh responded on ED attaches assets worth Rs.749 crores in YS Jagan Mohan Reddy case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X