జగన్ కేసులో ఈడీ బిగ్ షాక్ - కీలక పరిణామాలు, నెక్స్ట్ ఇక..!!
మాజీ సీఎం జగన్ కు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. కేసుల విచారణలో కీలక పరిణామాలు చోటు చేసు కొంటున్నాయి. తెలంగాణ హైకోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేసింది. రోజువారీ విచారణ జరిపి వేగంగా తేల్చాలని అధికారులు పిటిషన్‌లో కోరారు. జగన్ సహా నిందితులందరినీ వ్యక్తిగతంగా హాజరయ్యేలా ఆదేశించాలని కోరారు. సీబీఐ కోర్టులో తొమ్మిది ఈడీ ఛార్జిషీట్లు పదేళ్లుగా పెండింగ్ ఉన్నాయని పిటిషన్‌లో ప్రస్తావించారు. దీంతో.. ఇప్పుడు కోర్టు తీసుకునే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో కీలక పరిణామం. కేసుల విచారణను వేగవంతం చేయాలని కోరుతూ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుల్లో రోజువారీ విచారణ జరిపి, త్వరితగతిన పరిష్కరించేలా ఆదేశాలు ఇవ్వాలని ఈడీ తన పిటిషన్‌లో అభ్యర్థించింది. సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్లు తేలకపోవడంతో విచారణ ముందుకెళ్లట్లేదని తెలిపారు. ఆర్థిక నేరాలను ముప్పుగా పరిగణించాలని కోరారు. ఈడీ పిటిషన్‌పై హైకోర్టు ఇటీవల విచారణ జరిపిన విషయం తెలిసిందే. జగన్ కేసులు త్వరగా తేల్చాలని గతంలోనూ పిటిషన్ దాఖలైనట్లు హైకోర్టు గుర్తించింది. హరిరామజోగయ్య, ఇతరుల పిటిషన్లతో కలిపి ఈడీ పిటిషన్ జత చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. జగన్ కేసులను వేగంగా విచారణ జరపాలనే అన్ని పిటిషన్లను కలిపి ఈనెల 13వ తేదీన హైకోర్టు విచారణ జరపనుంది.

కోర్టు నిర్ణయం పై ఉత్కంఠ
సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసులకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన తొమ్మిది చార్జిషీట్లు దాదాపు దశాబ్ద కాలంగా సీబీఐ ప్రత్యేక కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని ఈడీ తెలిపింది. నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లు పరిష్కారం కాకపోవడం వల్లే విచారణ ముందుకు సాగడం లేదని పేర్కొంది. విచారణకు జగన్‌తో పాటు ఇతర నిందితులంతా వ్యక్తిగతంగా హాజరయ్యేలా ఆదేశించాలని కూడా ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది. గత కొన్నేళ్లుగా ఈ కేసుల్లో ప్రత్యేక కోర్టుల విచారణ, ఉన్నత న్యాయస్థానాల్లో సవాళ్లు వంటి పలు న్యాయపరమైన ప్రక్రియలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణ జరగాల్సి ఉంది. దీంతో.. వచ్చే విచారణ వేళ చోటు చేసుకునే పరిణామాల పైన ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications
