రాష్ట్రం విడిపోయినా ‘మా’ విడిపోలేదు, ప్రభావం లేదు: నటుడు సుమన్

విజయవాడ: రాష్ట్ర విభజన ప్రభావం తెలుగు సినీ పరిశ్రమపై ఏ మాత్రం పడలేదని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. ఆదివారం కృష్ణా జిల్లా గన్నవంర మండల పరిధిలోని కేసరపల్లి గ్రామంలో జెడ్పీటిసి సభ్యురాలు మరీదు లక్ష్మీదుర్గ నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు సినీ పరిశ్రమ అభివృద్ధికి చక్కటి సహకరం అందిస్తున్నాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోయినా ‘మా' విడిపోలేదని, తెలుగు సినీ కళాకారులంతా కలిసే వున్నారని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు విశాఖపట్టణం వాతావరం అనుకూలంగానే వుంటుందన్నారు.

 Effect of bifurcation is not on cien world

ఇండోర్ షూటింగ్స్‌కు ఇబ్బందులు వుండవని, అవుట్‌డోర్ షూటింగ్స్ ప్రస్తుతం చిన్న, పెద్ద అనే తేడా లేకుండా జరుగుతున్నాయని, బాగున్న సినిమాలు బాగా ఆడుతున్నాయన్నారు. కొత్త సినిమాల పరిస్థితి మూడు రోజుల్లో ఫలితాలు తెలిసిపోతున్నాయన్నారు.

పైరసీల వల్ల సినిమాలకు భారీ నష్టం సంభవిస్తుందని, పైరసీపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బాలకృష్ణకు అన్నగా ఓ సినిమాలో తాను నటిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సినిమా షూటింగ్ న్యూఢిల్లీలో జరుగుతుందని, వచ్చేనెల రెండో వారంలో హైదరాబాద్‌లో జరుగుతుందని సుమన్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+