తెరాసలోకి ఇంకొందరు, తలసాని బొమ్మ దగ్ధం(పిక్చర్స్)
హైదరాబాద్: తెరాసలో చేరేందుకు మరికొందరు గ్రేటర్ టీడీపీ నేతలు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నగర మాజీ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ వీడడం దాదాపుగా ఖరారైన నేపథ్యంలో ఆయన వెంటే తామంటున్నారు పలువురు తమ్ముళ్లు, నగర అనుబంధ కమిటీల అధ్యక్షులతో పాటు, సిటీ కమిటీలోని కొందరు నాయకులు సైకిల్ దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
పార్టీ కాదు.. మాకు తలసాని ముఖ్యమని చెబుతోన్న వారు రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనతోనే తమ పయనమని ప్రకటించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి అత్తిలి మల్లికార్జున్ గౌడ్, ఉపాధ్యక్షులు పవన్ కుమార్ గౌడ్, కార్యాలయ కార్యదర్శి సుంకరి రవీందర్, సిటీ మహిళా కమిటీ అధ్యక్షురాలు, బల్కంపేట కార్పొరేటర్ శేషుకుమారి, బీసీ సెల్ అధ్యక్షుడు తొలుపునూరి కృష్ణాగౌడ్, మాజీ కార్పొరేటర్ సామ ప్రభాకర్‌రెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డిలు మాట్లాడారు.
తలసాని శ్రీనివాస్‌యాదవ్ నేతృత్వంలో నగర కమిటీలో పని చేశామని, ఆయన వల్ల పార్టీకి ఎంతో ప్రయోజనం కలిగిందని అన్నారు. సంక్షోభ సమయంలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేశారన్నారు. దాని ఫలితమే నగరంలో టీడీపీ, బీజేపీ కూటమికి అత్యధిక స్థానాలు అని చెప్పారు. అలాంటి డైనమిక్ లీడర్ సేవలను పార్టీ సరైన స్థాయిలో వినియోగించుకోలేకపోయిందని అభిప్రాయపడ్డారు.
ఫ్లోర్‌లీడర్ పదవి విషయంలో తలసానిని పార్టీ అవమానించిందని, అడగక ముందే పదవి ఇస్తున్నట్లు మీడియాకు లీకులిచ్చి, తరువాత మార్చడం ఆయనతోపాటు తమనీ బాధించిందన్నారు. తన వెంట రమ్మని ఇప్పటి వరకు తమ నాయకుడు కోరలేదని, పార్టీ మారుతున్న విషయంపై కూడా ఇంకా స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. పార్టీలో ఉన్నా.. వేరే పార్టీలోకి వెళ్లినా.. ఆయన వెంటే ఉంటామని స్పష్టం చేశారు. మరోవైపు, తలసాని, తీగల తెరాసలో చేరడాన్ని నిరసిస్తూ రసూల్ పుర చౌరస్తలో వారి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.

తలసాని
సికింద్రాబాద్ నియోజకవర్గంలోఎదురులేని శక్తిగా టిడిపి పార్టీ ఉందని, పార్టీలో నుంచి ఎవరు వెళ్లినా నష్టం ఏమీ లేదని బౌద్ధనగర్, సీతాఫల్‌మండీ, చిలకలగూడ డివిజన్ల టిడిపి అధ్యక్షులు నారపాక నాగేష్, కొండల్ వెంకటేశ్వ రావు, జలంధర్ రెడ్డి అన్నారు.

తలసాని
శనివారం బౌద్ధనగర్‌లో టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ టిడిపి అభివృద్ధి కోసమే పాటు పడతామని అన్నారు.

తలసాని
తామంతా పార్టీ మారుతున్నామనేది పచ్చి అబద్ధమని అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఉన్న కూన వెంకటేశ్ గౌడ్ ఆధ్వర్యంలో తామంతా పార్టీ కోసం పని చేస్తామని అన్నారు.

తలసాని
ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ టిఆర్‌ఎస్‌లోకి వెళ్లినందున సనత్‌నగర్ నియోజకవర్గంలో టిడిపి ఇన్‌చార్జిగా కూన వెళుతున్నాడని దీంతో వివిధ డివిజన్ల నుంచి నాయకులు, కార్యకర్తలు టిడిపిని వదిలి టిఆర్‌ఎస్‌లోకి వెళుతున్న వస్తున్న వార్తలను నమ్మవద్దని అన్నారు.

తలసాని
మెట్టుగూడ, అడ్డగుట్ట, తార్నాక, చిలకలగూడ, సీతాఫల్‌మండి, బౌద్ధనగర్ డివిజన్ల అధ్యక్షులుగా తాము కాని తమ కార్యకర్తలు కాని పార్టీ వీడటం లేదని టిడిపి పార్టీలోనే ఉండి కూన వెంకటేశ్‌గౌడ్ నాయకత్వంలో పని చేస్తామని, కార్యకర్తలు పుకార్లను నమ్మవద్దని వారు పిలుపునిచ్చారు.

తలసాని
కూన వెంకటేశ్ గౌడ్‌ను శనివారం కలసి మాట్లాడామని, సనత్‌నగర్ వైపు దృష్టి సారిస్తారా లేక సికింద్రాబాద్ నియోజకవర్గం ఇన్‌చార్జిగా కొనసాగుతారా అనే దానిపై చర్చించామని చెప్పారు.

తలసాని
అయితే ఒకవేళ ఆయన ఆయన సనత్‌నగర్‌కు వెళ్లినా సికింద్రాబాద్ నియోజకవర్గంలో తమ స్వలాభం కోసం పార్టీలు మారిన వ్యక్తులను మాత్రం ఇన్‌చార్జిలుగా రానివ్వమని అన్నారు.

తలసాని
ఇటీవల చంద్రబాబును ఆరుగురు డివిజన్ల అధ్యక్షులు కలిసి చర్చించామని, తమ నెత్తిపైన ఎవరినో ఒకరిని పెడితే పని చెయ్యలేమని తమ అభిప్రాయాలు, కార్యకర్తలు అభిప్రాయాలు తీసుకుని ఇన్‌చార్జిగా నియమించాలని కోరామని చెప్పారు.

తలసాని
బస్సుయాత్ర ముగిసిన తర్వాత మీ అభిప్రాయం ప్రకారమే చేద్దామని బాబు హామీ ఇచ్చారన్నారు. కొందరు నాయకులు వివిధ పార్టీలు మారి ఈ మధ్యనే తలసాని తెరాసలోకి వెళుతున్నాడని తెలుసుకున్న ఇద్దరు నాయకులు హడావిడిగా గుంపులో గోవిందలా పార్టీ కండువాలు కప్పుకుని నియోజకవర్గ ఇన్‌చార్జిలు తామేనని చెప్పుకోవడం సిగ్గచేటన్నారు.

తలసాని
నియోజకవర్గంలో ఉన్న ఆరు డివిజన్ల అధ్యక్షులలో ఇన్‌చార్జిగా ఎవరిని చేసినా తామంతా కష్టపడి పార్టీ కోసం పని చేస్తామని, అయితే బయట వ్యక్తులను పార్టీలు మారి వచ్చిన వారిని మాత్రం ఇన్‌చార్జిలుగా నియమించవద్దని అధిష్టానం దృష్టికి తీసుకెళామన్నారు.

తలసాని
ఇందుకు అధిష్టానం కూడా సానుకూలంగా స్పందించిందని అన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంట తాము కాని, తమ కార్యకర్తలు కాని వెళ్లడం లేదని వారు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications