రేప్ నిందితుడికి శాస్తి, ఇఫ్లూ విద్యార్థినిపై హాస్టల్లోనే, అరెస్ట్

ఇఫ్లూ ఘటన: హాస్టల్‌లోనే దారుణం
ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు విద్యార్థులు తోటి విద్యార్థినిపై అత్యాచారం చేశారు. నాలుగు నెలల క్రితం ఇదే వర్సిటీ క్యాంపస్‌లో ఓ విద్యార్థి తన సహ విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించిన సంఘటన మరువక ముందే ఈ సంఘటన చోటు చేసుకోవడం విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తోంది.
24 గంటల తర్వాత ఆదివారం వెలుగు చూసిన ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఢిల్లీకి చెందిన ఓ విద్యార్థిని ఉన్నత విద్య కోసం నగరానికి వచ్చి ఇఫ్లూలో ఎంఏ (ఇంగ్లిష్) ద్వితీయ సంవత్సరం చదువుతోంది. క్యాంపస్‌లో ఉన్న హాస్టల్‌లోనే ఉంటోంది.
అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన నితిన్ సోలసముద్రం(22) ఇక్కడే ఎంసీజే మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అక్టోబరు 31న క్యాంపస్‌లోని బషీర్ హాస్టల్‌లో ఉండే తన స్నేహితురాలి గదికి బాధిత విద్యార్థిని వచ్చింది. ఆమె ఇతరులతో కలిసి చదువుకుంటుండటంతో తిరిగి తన గదికి తిరిగి వెళుతోంది. ఈ సమయంలో ఇఫ్లూలోనే ఎంసీజే చదువుతున్న నితిన్ మెట్ల వద్ద ఎదురై ఆమెను తన గదికి తీసుకెళ్లాడు.
అప్పటికే ఆ గదిలో ఇఫ్లూలో ఎంసీజే పూర్తి చేసి బాగ్‌లింగంపల్లిలోని ఎంఐజీ-2 బ్లాక్-8లో నివాసముంటున్న పశ్చిమ గోదావరి జిల్లా మల్కిపురానికి చెందిన రాజసింహ(24) ఉన్నాడు. ఇద్దరూ కలిసి ఆమెతో సిగరెట్ తాగారు. ఆమెకు మత్తు మందు ఇచ్చి అపస్మారక స్థితిలో ఉండగానే, ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు. మరునాడు ఉదయం మెలకువ వచ్చిన ఆమె, తన గదికి వెళ్లి తోటి విద్యార్థినులతో విషయాన్ని చెప్పింది.
అందరూ కలిసి ఓ అధ్యాపకురాలి సాయంతో వర్సిటీ వీసీకి సమాచారం అందించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారించి, వారిలో నితిన్, రాజసింహపై ఐపీసీ 341, 376-జీ(నిర్భయ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సెల్ ఫోన్ల పైన నిఘాతో బాగ్ లింగంపల్లిలో ఉండగా ఆదివారం సాయంత్రం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాచార ఘటనకు ముందు గదిలో ఉన్న మరో వారిని పోలీసు స్టేషన్‌కు తీసుకు వచ్చారు.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications