విద్యార్థిని రేప్: ఇప్లూలో టెన్షన్, ముద్దులపై హెచ్‌సీయులో
హైదరాబాద్: ఇఫ్లూ విశ్వ విద్యాలయంలో జరుగుతున్న ఘోరాలపై వైస్ ఛాన్స్‌లర్ అసమర్థతే కారణమని విద్యార్థి సంఘాలు సోమవారం ఆందోళనకు దిగాయి. పలు విద్యార్థి సంఘాలు వైస్ ఛాన్స్‌లర్ అసమర్థ పాలనతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించాయి.
అత్యాచారానికి పాల్పడిన వారిలో నలుగురు నిందితులు ఉంటే కేవలం ఇద్దరిని మాత్రమే అరెస్టు చేసి మరో ఇద్దరిని పోలీసులు ఎందుకు కాపాడుతున్నారని ఆరోపించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి నిందితులను కూడా అరెస్టు చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశాయి.
విద్యార్థుల ఆందోళనతో సోమవారం ఇఫ్లూ వద్ద ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులను అరెస్టు చేశారు. మిగిలిన ఆందోళనకారులను చెదరగొట్టారు. మరోవైపు, క్యాంపస్‌ను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాన వెంకటరత్నం సందర్శించారు. విద్యార్థినుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అదే విధంగా ఇఫ్లూ వైస్ ఛాన్స్‌లర్‌తో త్రిపురాన చర్చలు జరిపారు.

ఇఫ్లూ
హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం సమీపంలో ఉన్న ఇఫ్లూ యూనివర్సిటీ ఎదుట రేప్ నిందితులను శిక్షించాలంటూ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న దృశ్యం.

ఇఫ్లూ
హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం సమీపంలో ఉన్న ఇఫ్లూ యూనివర్సిటీ ఎదుట రేప్ నిందితులను శిక్షించాలంటూ ఆందోళన చేస్తున్న పీడీఎస్‌యూ విద్యార్థులు.

ఇఫ్లూ
హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం సమీపంలో ఉన్న ఇఫ్లూ యూనివర్సిటీ ఎదుట రేప్ నిందితులను శిక్షించాలంటూ ఆందోళన చేస్తున్న పీవోడబ్ల్యూ, ఐఎఫ్టీయూ సంఘాలు.

ఇఫ్లూ
హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం సమీపంలో ఉన్న ఇఫ్లూ యూనివర్సిటీ ఎదుట రేప్ నిందితులను శిక్షించాలంటూ ధర్నా చేస్తున్న ఏబీవీపీ. సెంట్రల్ వర్సిటీల్లో పాశ్చాత్య విష సంస్కృతి అరికట్టాలని ప్లకార్డులు పట్టుకున్న దృశ్యం.

ఇఫ్లూ
హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం సమీపంలో ఉన్న ఇఫ్లూ యూనివర్సిటీ ఎదుట రేప్ నిందితులను శిక్షించాలంటూ ధర్నా చేస్తున్న ఏబీవీపీ.
సెంట్రల్ వర్సిటీలో ఉద్రిక్తత
కిస్ ఆఫ్ లవ్ వివాదం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రెండో రోజైన సోమవారం కూడా ఉద్రిక్తత సృష్టించింది. సోమవారం కూడా కిస్ ఆఫ్ లవ్‌లో పాల్గొని నిరసన తెలపడానికి వచ్చిన విద్యార్థులు, ఏబీవీపీ విద్యార్థి సంఘం విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది.
కొన్ని పార్టీలు తమ తమ ఇష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ కేరళ విద్యార్థులు, బహిరంగంగా ముద్దులు హిందూ సంప్రదాయానికి వ్యతిరేకమని ఏబీవీపీ విద్యార్థులు, బయటి వ్యక్తులు యూనివర్సిటీలోకి రావడంపై యూడీఎఫ్ విద్యార్థులు పరస్పరం ఆందోళనకు దిగారు.
మూడు గ్రూపులకు చెందిన విద్యార్థులు పరిపాలన భవనంలోని వైస్ ఛాన్స్‌లర్ భవనం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇలా పోటాపోటీ ఆందోళనలు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగాయి. యూనివర్సిటీ రిజిస్ట్రార్ వచ్చి కిస్ ఆఫ్ లవ్ వివాదంపై ఓ కమిటీ వేస్తున్నామని, ఆ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఆందోళన విరమింప చేశారు.












Click it and Unblock the Notifications