వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి

Eight dead in an road accident
చిత్తూరు/నెల్లూరు: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మంగళవారం ఎనిమిది మంది మృతి చెందారు. కడప జిల్లాలో ఓ ప్రమాదం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మరో ప్రమాదం జరిగింది. మహబూబ్ నగర్ నుండి తిరుపతి వెళ్తున్న వ్యాను కడప జిల్లా పుల్లంపేట మండలం పుత్తనవారిపల్లి మలుపు వద్ద ప్రమాదానికి గురైంది.

రోడ్డు పక్కన నిలిపి ఉన్న స్కూటరును ఢీకొని తర్వాత ఓ చెట్టుకు ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యానులు ఉన్న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఐదుగురు అక్కడికి అక్కడే మృతి చెందారు. స్కూటరు పైన కూర్చున్న వెంకటప్రసాద్ అనే చిన్నారి మృతి చెందాడు.

వ్యానులో ప్రయాణిస్తున్న మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం రాజంపేట ఆసుపత్రికి తరలించారు.

ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా ఎళ్లకూరు మండలం చిల్లకూరు వద్ద పిఎశ్ రోడ్డు మార్గంలో ఓ లారీ, సుమో ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. చిత్తూరుకు చెందిన గంగనపల్లి వాసి చంద్రశేఖర్ కుటుంబం విజయవాడకు వెళ్లి తిరుగు ప్రయాణంలో చిల్లకూరు వద్ద టైరు పంక్చరై ఆగారు. అప్పుడు ఎదురుగా వస్తున్న లారీ ఢీకొని సుమోలో ఉన్న జయలక్ష్మి, హరిప్రసాద్ మృతి చెందారు. మరో ఐదుగురికి కాయాలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+