AP Elections: మరో కీలక అధికారిపై ఈసీ వేటు-తక్షణం తప్పుకోవాలని ఆదేశం..!
ఏపీలో ఎన్నికల వేళ ఈసీ కొరఢా ఝళిపిస్తోంది. ఎన్నికల సమయంలో నిష్పాక్షికంగా వ్యవహరించని అధికారుల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలో ఒకేసారి ఆరుగురు ఐపీఎస్ లు, ముగ్గురు ఐఏఎస్ లపై బదిలీ వేటు వేసిన ఈసీ.. ఇప్పుడు మరో కీలక అధికారిని తొలగించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై అందిన ఫిర్యాదుల మేరకు ఆయన్ను విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలో బెవరేజస్ కార్పోరేషన్ లిమిటెడ్ ఎండీగా ఉన్న డి.వాసుదేవరెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఆయన్ను తక్షణం విధుల నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రదాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు ఈసీ ఆదేశాలు పంపింది. డి.వాసుదేవరెడ్డికి ఎన్నికల విధులు అప్పగించకూడదని ఆదేశించింది. ఆయన స్ధానంలో ప్రత్యామ్నాయంగా మరో అధికారిని నియమించేందుకు వీలుగా ముగ్గురు ఐఏఎస్‌ల పేర్లతో జాబితా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించింది.

ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన విధుల్లో ఉన్న పలువురు అధికారులు అధికార వైసీపీకి అనుకలంగా వ్యవహరిస్తున్నారనే పిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో డీజీపీ, సీఎస్ తో పాటు పలువురు అదికారుల పేర్లను విపక్షాలు ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ఈసీ క్షేత్రస్దాయిలో వాస్తవాలను పరిశీలించి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వాలంటీర్లతో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులపై సైతం ఈసీ వేటు వేసింది.












Click it and Unblock the Notifications