అప్పుడు ముద్దులిచ్చి, ఇప్పుడు గుద్దులా, మందడం మహిళా రైతులపై దాడిపై అమరావతి అన్నదాతలు
Recommended Video
రాజధానిని మార్చొద్దని గత 18 రోజులుగా అమరావతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం మందడంలో మహిళా రైతులపై అసభ్య ప్రవర్తనను నిరసిస్తూ ఇవాళ రైతులు బంద్‌నకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బంద్‌తో బ్యాంకులు, స్కూళ్లు, కాలేజీలు మూసివేశారు. కిరణా షాపులు, ఇతర సముదాయాలు కూడా మూసివేసి బంద్‌కు సహకరిస్తున్నారు. అమరావతి రాజధానిని మార్చొద్దని రైతులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

తుళ్లూరులో మహాధర్నా..
అమరావతిలో దీక్ష చేపట్టిన రైతులు ర్యాలీగా తుళ్లూరు చేరుకుంటున్నారు. తుళ్లూరులో మెగా ర్యాలీ స్థలికి వస్తోన్నారు. మహిళలపై పోలీసుల అనుచిత ప్రవర్తన నేపథ్యంలో బంద్‌కు అన్నివర్గాలు మద్దతు తెలిపాయి. వ్యాపారులు స్వచ్చందంగా షాపులు మూసివేసి బంద్‌కు సపోర్ట్ చేస్తున్నారు. రాజధాని మార్చొచ్చని, ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

5 కోట్ల మంది ఆంధ్రులు..
తమ బంద్‌కు 5 కోట్ల మంది ఆంధ్రులు సపోర్ట్ చేయాలని రైతులు కోరుతున్నారు. 18 రోజులుగా తాము శాంతియుతంగా నిరసన చేపడుతున్నామన్నారు. కానీ నిన్న మందడంలో మహిళా రైతులతో పోలీసుల ప్రవర్తన సరిగా లేదన్నారు. ఆందోళన చేస్తున్న మహిళలను కొరికి, రక్కడం ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు. పోలీసు జులం నశించాలి అని డిమాండ్ చేస్తున్నారు. అనుచితంగా ప్రవర్తించిన వారిని విధుల నుంచి తప్పించాలని తేల్చిచెప్పారు.

అప్పుడు ముద్దులు..
మందడంలో మహిళ రైతులపై దాడి జరిగితే తమ వద్దకు ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడతారే తప్ప.. తమ దగ్గరకు ఎందుకు రావడం లేదు అని అడుగుతున్నారు. ఓట్లు అడిగే సమయంలో ముద్దులు పెట్టి, ఇప్పుడు గుద్దడం ఏంటీ అని మండిపడుతున్నారు. రాజధాని కోసం భూములిస్తే పోలీసుల చేత దాడులు చేయిస్తారా అని నిలదీశారు.

పోలీసు జులుం..
13 జిల్లాల ప్రజల ప్రయోజనాల కోసం రాజధాని భూములు ఇచ్చామని అన్నదాతలు చెప్తున్నారు. కానీ రాజధాని మార్పు పేరుతో పోలీసులు తమపై విరుచుకుపడటం సరికాదంటున్నారు. జీవనాధారమైన పొలం ఇచ్చిన రైతులం తప్పా.. రౌడీ, గుండాలం కాదని వాపోయారు. రాజధాని కోసం భూములిచ్చినా తమ భవిష్యత్‌ను పట్టించుకోవడం లేదని నిట్టూరుస్తున్నారు. కమిటీలతో తమ భవిష్యత్ అంధకారం చేయొద్దని సూచించారు. అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేశారు. రైతులంతా కలిసి తుళ్లూరు సెంటర్ వద్దకు చేరుకొని మహాధర్నా చేపడుతారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications