వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువ‌నేస్తం పెంపు కు ఈసి బ్రేక్‌: సెల్‌ఫోన్లు..హామీల అమ‌లుకు అనుమ‌తిస్తారా : టిడిపి లో కొత్త టెన్ష‌న్

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర ప‌డుతోంది. ఏపి అధికార పార్టీ తాజాగా ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన వ‌రాల‌తో వ‌చ్చే ఓట్ల పై ఆశ‌లు పె ట్టుకుంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌భుత్వం ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆర్భా టంగా ప్ర‌చారం చేస్తున్న యువ‌నేస్తం పెంపు కు ఎన్నిక‌ల సంఘం బ్రేకు వేసింది. ఇదే స‌మ‌యంలో డ్వాక్రా మ‌హిళ‌ల‌కు సెల్‌ఫోన్లు ఇస్తామ‌ని చెబుతున్న టిడిపి అధినేత‌..దీని పై ఇప్పుడు ఈసి ఎలా స్పందిస్తుంద‌నేది ఉత్కంఠ గా మారింది..

దుర్మార్గుడు గుడివాడ వైసిపి అభ్య‌ర్ది:తిన్నింటి వాసాలు లెక్క‌పెట్టే ర‌కం: కొడాలి నాని పై చంద్ర‌బాబుదుర్మార్గుడు గుడివాడ వైసిపి అభ్య‌ర్ది:తిన్నింటి వాసాలు లెక్క‌పెట్టే ర‌కం: కొడాలి నాని పై చంద్ర‌బాబు

యువ‌నేస్తం పెంపుకు బ్రేక్‌..

యువ‌నేస్తం పెంపుకు బ్రేక్‌..

ఏపీలోని 7 జిల్లాల్లో యువనేస్తం సాయం రూ. 2 వేలకు పెంచేందుకు ఈసీ బ్రేక్‌ వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కోడ్‌ ఉన్నందున 7 జిల్లాల్లో యువనేస్తం సాయం ఏపీ ప్రభుత్వం పెంచలేదు. ఆరు జిల్లాల్లో మాత్రమే యువనేస్తం సా యం పంపిణీ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి అయ్యినందున 7 జిల్లాల్లో యువనేస్తం సాయం ఇచ్చేందుకు అంగీక రించాలని ఈసీని కోరింది. అయితే ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించింది ఎన్నికల సంఘం. 2014 ఎన్నిక‌ల్లో నిరుద్యోగ యువ‌త‌కు రెండు వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని టిడిపి హామీ ఇచ్చింది. అయితే, గ‌త ఏడాది నుండి నెల‌కు వెయ్యి రూపాయాల చొప్పున భృతి ఇచ్చేందుకు నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా దానిని రెండు వేల పెంచుతూ నిర్ణ‌యించింది. ఇప్పుడు ఆ హామీ అమ‌లుకు ఎన్నిక‌ల సంఘం అడ్డు చెప్పింది.

డ్వాక్రా మ‌హిళ‌ల‌కు సెల్ ఫోన్లు ఇస్తారా..

డ్వాక్రా మ‌హిళ‌ల‌కు సెల్ ఫోన్లు ఇస్తారా..

ఏపిలో మొత్తం డ్వాక్రా సంఘాల్లోని మ‌హిళ‌లంద‌రికీ ఎన్నిక‌ల ముందే సెల్ ఫోన్లు ఇస్తామ‌ని టిడిపి అధినేత చంద్ర‌బా బు ప‌దే ప‌దే చెబుతూ వ‌స్తున్నారు. దీనికి సంబంధించి గ‌తంలోనే మంత్రి వ‌ర్గ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక‌, ఇప్పుడు పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో అవి ఎప్పుడు ఇస్తార‌నే దాని పై చ‌ర్చ మొద‌లైంది. అయితే, తాజా గా నిరు ద్యోగ భృతి విష‌యంలో ఎన్నిక‌ల సంఘం అభ్యంత‌రం చెప్ప‌టంతో..మ‌రి డ్వాక్రా సంఘాల‌కు సెల్ ఫోన్లు ఇ వ్వ‌టం పై ఏ ర‌కంగా స్పందిస్తుద‌నే టెన్ష‌న్ మొద‌లైంది. అదే విధంగా పెండింగ్‌లో ఉన్న రైతు రుణ మాఫీ రెండు వి డ‌త‌లు.. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ప‌సుపు-కుంకుమ మూడో విడ‌త‌, అన్న‌దాత సుఖీభ‌వ న‌గ‌ద‌రు ఏప్రిల్ 4,5 తేదీల్లో ల‌బ్ది దారుల బ్యాంకు ఖాతా ల్లో జ‌మ కానున్నాయి. వీటి ద్వారా అధికార పార్టీ టిడిపి పై సానుకూల‌త పెరిగి..త‌మ‌కు మేలు జ‌రుగుతంద‌ని టిడిపి నేతలు అంచ‌నా వేస్తున్నారు.

 ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యాల పై టెన్ష‌న్..

ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యాల పై టెన్ష‌న్..

ఇదే స‌మ‌యంలో..ఎన్నిక‌ల సంఘం గ‌తంలో తీసుకున్న నిరుద్యోగ భృతి అమ‌లు పై కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పెం చిన రెండు వేల పంపిణీకి బ్రేక్ వేసింది. ఇదే విధంగా..మిగిలిన నిర్ణ‌యాల పైనా ఎన్నిక‌ల సంఘం అభ్యంత‌రం చెబి తే..తాము ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని టిడిపి అధినాయ‌క‌త్వం ఆందోళ‌న చెందు తోంది. పోలింగ్ కు వారం ముందుగా వీటిని ల‌బ్దిదారుల‌కు అందించ‌టం ద్వారా పూర్తి స్థాయిలో ఎన్నిక‌ల్లో ప్ర‌యెజ‌నం పొంద‌వ‌చ్చ‌నే టిడిపి నేత‌ల ఆశల పై ఎన్నిక‌ల సంఘం ఏ ర‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌నేది ఇప్పుడు టిడిపి నేత‌ల్లో టెన్ష‌న్ కు కార‌ణ‌మవుతోంది. ఏ ర‌కంగా అయినా..వీటిని ల‌బ్దిదారుల‌కు చేరే వ‌ర‌కు ఇబ్బందులు లేకుండా ఎన్నిక‌ల సంఘా న్ని ఒప్పించేలా టిడిపి నేత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

English summary
Election commission objected AP govt yuvanestam distribution hike up to 2000. Now new tension started in TDP. AP govt planning to distribute other schemes on April 4th and 5th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X