పవన్ కల్యాణ్‌కు ఎన్నికల సంఘం మరో షాక్
సార్వత్రిక ఎన్నికల ముందు జనసేన పార్టీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నాయకులు జనసేనను వీడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జనసేన పార్టీలో టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు. జనసేనలో టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. పవన్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు చేస్తూ జనసేన నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు.
ఇదే సమయంలో ఎన్నికల సంఘం కూడా జనసేనకు షాకిచ్చింది. జనసేనను రాజకీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తించలేదు. రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో జనసేనను ఉంది. జనసేన గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్స్ జాబితాలో ఈసీ ఉంచింది. జనసేన పోటీలో లేనిచోట ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గుర్తు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాజు గుర్తుకు సంబంధించి ఈసీ నిర్ణయంతో జనసేన నేతల్లో కొత్త టెన్షన్ మొదలైంది. తాజాగా జనసేనకు ఎన్నికల సంఘం మరో షాకిచ్చింది.

గాజు గ్లాసును పోలిన గుర్తును మరొకటి తెర మీదకు తీసుకువచ్చింది. బకెట్ గుర్తు అచ్చం గాజు గ్లాసు మాదిరిగానే ఉండటంతో జనసేన నాయకులు భయంతో వణికిపోతున్నారు. బకెట్ గుర్తు ఇప్పుడు జనసేన పార్టీను కలవరపాటుకు గురి చేస్తోంది. నవరంగ్ పార్టీకి బకెట్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. తమ గుర్తును పోలి ఉన్న బకెట్‌తో పెద్ద ప్రమాదమే ఉందని జనసేన నాయకులు భావిస్తున్నారు.
గతంలో తెలంగాణలో బీఆర్ఎస్కు కూడా ఇలాంటి కష్టాలు వచ్చాయి. కారు గుర్తుని పోలి ఉన్న రోడ్డురోలర్, చపాతీ కర్ర, ఆటోరిక్షా, ఇస్త్రీపెట్టె, ట్రక్కు గుర్తులు చాలా ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు జనసేన వంతు వచ్చింది. దీనిపై జనసేన నాయకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే నవరంగ్ పార్టీ అధ్యక్షుడును జనసేన నాయకులు బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications