నారా భువనేశ్వరికి షాక్..నోటీసులు జారీ
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికు రాష్ట్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణంతో నారా భువనేశ్వరికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.ఆమె ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఈ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ''నిజం గెలవాలి'' అనే పేరుతో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల అధికారులను కలిసి భువనేశ్వరి కోడ్ ఉన్న సమయంలో చెక్కులు పంపిణీ చేశారని, దీని మీద చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ అంశంపై శనివారం నారా భువనేశ్వరికు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. దీనిపై మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం విచారణ జరిపి 24 గంటల్లో తమకు నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేశారు.

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో ''నిజం గెలవాలి'' పేరుతో నారా భువనేశ్వరి పర్యటనలు చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యారనే మనస్తాపంతో మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని ఆ సమయంలో నారా భువనేశ్వరి మాట ఇవ్వడం జరిగింది.

ఈ నేపథ్యంలో వారికి ఆర్థిక సాయం చేస్తూ.. చెక్కుల పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో దీనిపై అధికార పార్టీ నేతలు.. ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని నారా భువనేశ్వరికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications