సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!

ఏపీలో ఎన్నికల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల సంఘం సిబ్బంది, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు పైన కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు అందాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓట్ ఫ్రం హోమ్, పోస్టల్ బ్యాలెట్ కు సిబ్బంది సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల పైన కీలక నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులను ఎన్నికల విధుల్లో వినియోగించుకునేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే వారిని కేవలం ఒపిఒలు (అదర్‌దెన్‌ పోలింగ్‌ ఆఫీసర్స్‌)గా మాత్రమే వినియోగించుకునేరదుకు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కొంత మందికి శిక్షణ కూడా ఇస్తుండడంతోపాటు కార్యదర్శుల సామాజిక గ్రూపుల్లో దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. వాస్తవానికి ఉపాధ్యాయుల స్థానంలో వలంటీర్లను, కార్యదర్శులను పూర్తి స్థాయిలో ఎన్నికల విధుల్లో వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.

Election duites for Ward and Village Secretariat Secrataries as OPO s in AP Elections

కానీ ,వలంటీర్ల వినియోగంపై ఎన్నికల కమిషన్‌, న్యాయ స్థానాలను అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్లపై వెనకడుగు వేయాల్సి వచ్చింది. అయితే కార్యదర్శులు మాత్రం అధికారికంగా ఉద్యోగులుగా ఉండడంతో వారి సేవలను ఎన్నికల్లో ఉపయోగించుకునేందుకు నిర్ణయించిరది. అయితే పోలిరగ్‌ అధికారులు, సహాయ పోలింగ్‌ అధికారులుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులను మాత్రమే వినియోగించుకురటూ గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులను సాధారణ విధులకు వినియోగించుకోవాలని నిర్ణయించారు. కేవలం ఓటర్ల వేలుపై ఇంకు గుర్తు వేయడం, వారి ఓటర్‌ స్లిప్పులను ఓటర్ల జాబితాలో ఉన్నాయా లేదా అన్నది చూడడం వంటి అంశాలకు మాత్రమే వారిని పరిమితం చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+