ఈ పాలు బ్రాందీ, విస్కీ కంటే ఎక్కువ కిక్ ఇస్తాయి!
పాలు తాగితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామనే విషయం తెలిసిందే. ఎందుకంటే అందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మనిషి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే ప్రతిరోజు కచ్చితంగా ఒక గ్లాసు పాలు తాగాలి. అందులో ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్లు, కొవ్వు, అమైనో యాసిడ్లు, ఎసెన్షియల్ అమైనో యాసిడ్లు లభిస్తాయి. పాలు ప్రతిరోజు తీసుకోవడంవల్ల ఎముకలు దృఢంగా మారతాయి. దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మన డైట్ లో పాలను చేర్చుకుంటే కండరాలు, కణజాలాల అభివృద్ధికి తోడ్పడుతుంది. సాధారణంగా మనం ప్రతిరోజు ఆవు లేదంటే గేదె పాలు మరికొందరు మేకపాలు తాగుతుంటారు. అయితే ఒక జంతువు పాలల్లో మాత్రం ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉంటుంది.
ఆడ ఏనుగు పాలల్లో 60 శాతం ఆల్కహాల్ ఉంటుంది. ఏనుగులు ఎక్కువగా తమ ఆహారం కింద చెరకును తీసుకుంటుంటాయి. ఇథనాల్ ప్రధాన వనరు అయిన చెరుకును ఏనుగులు తింటాయి. దీన్నుంచి వైన్ కూడా తయారు చేస్తారు. ఒక్కో ఏనుగు ప్రతిరోజు 150 కిలోల ఆహారం తీసుకుంటుంది. ఇంత పెద్దమొత్తంలో ఆహారం తీసుకుంటాయి కాబట్టే ఏనుగు పాలల్లో పోషకాలతోపాటు ఆల్కహాల్ ఉంటుంది. మనుషులకు ఏనుగు పాలు జీర్ణం కావు.

ఏనుగు పాలల్లో కనిపించే కెమికల్స్ ఇతర జంతువుల పాలల్లో కంటే ఎక్కువగా ఉంటాయి. ఆఫ్రికన్ ఏనుగు పాలలో ఆల్కహాల్ 62 శాతం ఉన్నట్లు పరిశోధనలో కనుగొన్నారు. విస్కీ బాటిల్‌లో లభించే ఆల్కహాల్ కంటే చాలా ఎక్కువ. పాడి జంతువుల్లో తక్కువగా ఉండే ఒలిగోసాకరైడ్స్ అని పిలువబడే కార్బోహైడ్రేట్లు ఉంటాయి.వీటివల్ల గ్యాస్, విరేచనాలు, కడుపు ఉబ్బరం లాంటివి సంభవిస్తాయి. అందుకే వైద్యులెవరూ ఏనుగు పాలను తాగమని సూచించరు. ఇవి మనిషి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవి.












Click it and Unblock the Notifications