వ్యభిచారం చేస్తూ పట్టుబడిన టిటిడి ఉద్యోగిపై వేటు

Employe removed for misbavior at Tirupathi
తిరుపతి: వ్యభిచారం చేస్తూ పట్టుబడిన తమ ఉద్యోగిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి కఠిన చర్య తీసుకుంది. దేవస్థానం చరిత్రలో ఒక ఉద్యోగికి ఉద్వాసన పలకడం ఇదే మొట్టమొదటిసారి. పవిత్రపుణ్యక్షేత్రం తిరుమలలో అనైతిక కార్యకలాపాలకు పల్డడిన పి. గోపీచంద్ అనే ఉద్యోగిని తొలగిస్తున్నట్లు బుధవారం టిటిడి ప్రకటించింది.

శంఖుమిట్ట ఉప విచారణ కార్యలయ ఉగ్రాణం గుమస్తాగా పనిచేస్తోన్న సమయంలో పి. గోపీనాథ్ గత ఏడాది ఉగ్రాణంలోనే సులభ కార్మికురాలితో వ్యభిచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో వీరిని తితిదే నిఘా, భద్రతా విభాగం సిబ్బంది వలపన్ని పట్టుకున్నారు. వెంటనే నిందితులను పోలీసులకు అప్పగించారు.

అనంతరం బదిలీ వేటువేసి టిటిడి విచారణ చేపట్టింది. ఈ విచారణలో వాస్తవాలు తేలండతో నిందితుడిని ఉద్యోగం నుంచి తొలగించాలని టిటిడి పాలక మండలి నిర్ణయించింది. ఈ నేపధ్యంలో తొలగింపు ఉత్తర్వులను దేవస్థానం గోదాం అసిస్టెంటుగా పనిచేస్తోన్న గోపీనాథ్‌కు బుధవారం అందజేసింది.

ఇదే సమయంలో తితిదే గుర్తింపు కార్డు, లడ్డూ కార్డులను స్వాధీనం చేసుకుంది. ఇలాంటి చర్య దేవస్థానంలో ప్రధమంగా జరిగినట్లు సీనియర్ అధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+