అర్చక నిధుల కోసం లంచం డిమాండ్: రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ!
డాక్యుమెంట్స్ పరిశీలించిన వెంకటేశ్వర్లు.. అర్చక నిధి ఇన్‌చార్జ్ బిందుబాయ్ ను సంప్రదించాల్సిందిగా చెప్పారు. దీంతో బిందుబాయ్ వద్దకు వెళ్లగా. ఆమె రూ.5వేలు లంచం డిమాండ్ చేశారు.
కర్నూలు: పరిహారం కోసం వచ్చిన వ్యక్తుల నుంచి లంచం డిమాండ్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు ఇద్దరు దేవాదాయ శాఖ అధికారులు. మృతి చెందిన ఓ పూజారి కుటుంబానికి అర్చక నిధులు మంజూరు చేసేందుకు గాను వీరిద్దరు రూ.1లక్ష లంచంగా డిమాండ్ చేశారు. అదే సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ జయరామరాజు అధ్వర్యంలో జరిపిన దాడుల్లో ఈ గుట్టు బయటపడింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే.. డోన్ మండలం కొత్తకోట చెన్న కేశవస్వామి ఆలయంలో పూజారిగా పనిచేసిన శేషయ్య గతేడాది మృతి చెందారు. ఆయన కుటుంబానికి అర్చక నిధి నుంచి రూ.2.50లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో శేషయ్య భార్య పద్మావతి అర్చక నిధి కోసం దేవాదాయశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుంది.

ఈ నేపథ్యంలో మంజూరైన నిధుల కోసం అసిస్టెంట్ కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్న బి.వెంకటేశ్వర్లను పద్మావతి సంప్రదించారు. డాక్యుమెంట్స్ పరిశీలించిన వెంకటేశ్వర్లు.. అర్చక నిధి ఇన్‌చార్జ్ బిందుబాయ్ ను సంప్రదించాల్సిందిగా చెప్పారు. దీంతో బిందుబాయ్ వద్దకు వెళ్లగా. ఆమె రూ.5వేలు లంచం డిమాండ్ చేశారు. ఇన్ స్పెక్టర్ మరో రూ.2వేలు లంచం డిమాండ్ చేశారు.
దీంతో పద్మావతి ఏసీబీని ఆశ్రయించింది. ముందస్తు ప్లాన్ ప్రకారం.. మంగళవారం సాయంత్రం 4గం. సమయంలో పద్మావతి అల్లుడు రాధాకృష్ణమూర్తి, అతని అన్న పూజారి వెంకటరమణతో కలిసి అధికారులకు డబ్బులు ఇస్తుండగా, ఏసీబీ వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. వారిని కోర్టు ఎదుట హాజరుపరిచిన అనంతరం.. రిమాండ్‌కు తరలించారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications