ప్రేమోన్మాది: ఐటి కారిడార్‌లో యువతిపై ఇంజనీరింగ్ విద్యార్థి దాడి

అనంతరం వారిద్దరూ కళాశాల మారారు. అప్పుడే ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట పడేవాడు దినేష్. ఆ తర్వాత ఆమె తండ్రికి హైదరాబాద్ బదిలీ కావడంతో అక్కడి నుంచి వచ్చేశారు. గచ్చిబౌలిలోని జీపీఆర్‌ఏ క్వార్టర్స్‌లో వారు నివాసముంటున్నారు. యువతి చిరునామా తెలుసుకుని హైదరాబాద్ వచ్చిన దినేష్ ఆమెను బైక్ మీద ఎక్కించుకుని ఐటీ కారిడార్‌లోని వరుణ్ మోటార్స్ పక్కన గల ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లాడు.
తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి చేశాడు. అయితే అందుకు ఒప్పుకోకపోవడంతో వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను వీపుపై పొడిచేశాడు. ఆ తర్వాత తన బైకుపైనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించాడు. యాక్సిడెంట్ అయిందంటూ వైద్యులకు చెప్పాడు. అయితే ఒంటిపై గాయాలు చూసి అనుమానించిన వైద్యులు అతడిని అక్కడే కూర్చోబెట్టి పోలీసులకు సమాచారమిచ్చారు.
పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, అతనిది గుంటూరు జిల్లా తెనాలి అని తెలుస్తోంది. నెల క్రితం ఇంజనీరింగ్ విద్యార్థినిపై కాలేజీ క్యాంపస్‌లోనే దాడిచేసిన ఘటన మరువకముందే ఈ ఘటన జరగడం గమనార్హం.
విషమంగా యువతి పరిస్థితి
దినేష్ దాడిలో గాయపడ్డ యువతి పేరు దివ్య. ఆమె ఆరోగ్య పరిస్థితి పైన పదిగంటలకు వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. దివ్య ఐసీయులో ఉందని, ఆ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఆపరేషన్ చేయాల్సి ఉందని, ఆ తర్వాత మిగతా ఆరోగ్య వివరాలు చెప్పగలమని తెలిపారు. ఇదిలా ఉండగా, నిందితుడి పైన నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications