Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ సర్కార్‌పై ఇంగ్లండ్ క్రికెటర్స్ షాకింగ్ కామెంట్స్

ఐదు టెస్ట్ మ్యాచులు ఆడటానికి ఇంగ్లండ్ క్రికెట్ ఆటగాళ్లు ఇండియాకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. మొదటి టెస్ట్‌ హైదరాబాద్‌లో జరగ్గా.. ఈ మ్యాచులో ఇంగ్లండ్ విజయం సాధించింది. రెండో టెస్ట్ మ్యాచ్‌కు ఏపీలోని విశాఖపట్నం వేదికగా నిలిచింది. విశాఖలో జరిగిన మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత ఆటగాళ్లు చేలరేగడంతో ఈ మ్యాచ్ నాలుగు రోజుల్లోనే ముగిసింది.

ఇదిలా ఉంటే రెండో టెస్ట్ మ్యాచ్ కోసం విశాఖకు చేరుకున్న ఇంగ్లండ్ ఆటగాళ్లు సరదాగా అక్కడ ప్రదేశాల్లో తిరిగారు. ముఖ్యంగా విశాఖ బీచ్ అందాలను ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆస్వాదించారు. వీరితో పాటు ఇంగ్లండ్ అభిమానులు సైతం విశాఖ రామకృష్ణ బీచ్‌లో సందడి చేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ..విశాఖ సిటీ అద్భుతంగా ఉందని ఇంగ్లండ్ అభిమానులు కితాబిచ్చారు.

England cricket fans comments on vizag city

విశాఖ రామకృష్ణ బీచ్‌ చాలా క్లీన్‌గా ఉందని..ఇక్కడ వాతవరణం చూసిన తరువాత విశాఖలోనే సెటిల్ అయిపోవాలనిపిస్తోందని వారు చెప్పుకొచ్చారు. తాము ముంబై, కోల్‌కత, చైన్నై వంటి నగరాల్లో ప్రయాణించామని.. కాని విశాఖ ఉన్నంత బీచ్‌లో ఉన్న పరిశుభ్రత అక్కడ లేదని ఇంగ్లండ్ అభిమానులు తెలిపారు. ఇక రెండో టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఎయిర్‌పోర్ట్ నుంచి హోటల్స్‌కు ఇంగ్లండ్ ఆటగాళ్లను ఆర్టీసీ బస్సులోనే తరలించింది జగన్ సర్కార్.

అంతర్జాతీయ క్రికెటర్లను సాధారణంగా ప్రైవేటు బస్సుల్లోనే ప్రయాణిస్తుంటారు. కాని దానికి విరుద్దంగా వైసీపీ ప్రభుత్వం ఇంగ్లండ్ క్రికెటర్లను ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో స్టేడియానికి తరలిచింది. దీనిపై బీసీసీఐతో పాటు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సైతం ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధకు ధన్యవాదాలు తెలిపింది. తమకు ఏర్పాటు చేసిన సౌకర్యాలపై కూడా ఇంగ్లండ్ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+