TTD: బ్రహ్మోత్సవాల వేళ శ్రీవారి భక్తులకు ఈవో కీలక సూచన..!!

Tirumala: శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలు రేపు (శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతీ రోజు వాహన సేవలు ఉదయం 8 గంటలకు..రాత్రి 7 గంటలకు నిర్వహించనున్నట్లు ఈవో శ్యామలరావు వెల్లడించారు. గరుడ వాహన సేవ 8వ తేదీ రాత్రి జరుగుతుందన్నారు. వాహన సేవ దర్శనంతో పాటు మూలవిరాట్టు దర్శనం భక్తులకు సంతృప్తికరంగా కల్పిస్తామని చెప్పారు.

వాహన సేవలు
బ్రహ్మోత్సవాల వేళ తొమ్మిది రోజుల పాటు ఆర్జిత సేవలతో పాటు అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేశామని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల కోసం ప్రత్యేకంగా 1250 మంది విజిలేన్స్, 3900 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. 24 ప్రాంతాల్లో 4 వేల వాహనాలు పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో పేర్కొన్నారు. వైద్య సేవల కోసం అదనంగా 45 మంది డాక్టర్లు, 65 మంది మెడికల్ సిబ్బందిని నియమించామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 155257 నెంబర్‌తో ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

EO Shaymala Rao briefs on Sriavri Brahmotsavams to begin on Friday details here

ప్రత్యేక ఏర్పాట్లు
నిత్యం 400 ఆర్టీసీ బస్సుల ద్వారా 2 వేల ట్రిప్పులు నడిపేలా ఏర్పాట్లు చేశామన్నారు. 21 రాష్ట్రాల నుంచి విచ్చేసిన 160 కళాబృందాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తాయన్నారు. గరుడ సేవ రోజున సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వాహన సేవ ఉంటుందని తెలిపారు. గరుడ సేవ రోజున 24 గంటల పాటు ఘాట్ రోడ్డు, నడక దారులు తెరిచి ఉంచుతామని ప్రకటించారు. నాలుగు వేల మంది శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలు అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు.

తిరుమలకు చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (శుక్రవారం) తిరుమలకు రానున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా సతీ సమేతంగా శ్రీవారికి పుట్టు వస్త్రాలను చంద్రబాబు సమర్పించునున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు విజయవాడ నుంచి సీఎం బయలుదేరనున్నారు. రేపు రాత్రి 9 గంటలకు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు. అనంతరం 5వ తేదీ ఉదయం 8 గంటలకు వకుళమాత కేంద్రీకృత వంటశాలను ప్రారంభించనున్నారు. 9 గంటలకు తిరిగి రేణిగుంట నుంచి హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+