కెటిఆర్‌కు ఆ పేరెందుకు: కెసిఆర్‌ను ఏకిపారేసిన ఎర్రబెల్లి

Errabelli blames KCR and his family
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు శుక్రవారం నిప్పులు చెరిగారు. గెలిచే సీట్లన్నీ కెసిఆర్ తన కుటుంబ సభ్యులకు ఇచ్చి, ఓడిపోయే సీట్లన్నీ విద్యార్థులకు, ఉద్యమకారులకు ఇచ్చారని ఆరోపించారు.

కుటుంబ సభ్యులకు పదవులు కట్టబెట్టడమే ఆయన ఆశయమన్నారు. మాటమీద నిలబడటం కెసిఆర్‌కు తెలియదని విమర్శించారు. తొలి ముఖ్యమంత్రి దళితుడని చెప్పి మాట మార్చింది కెసిఆర్ కాదా అని ప్రశ్నించారు. కెసిఆర్ కాంగ్రెసు పార్టీకి అమ్ముడు పోయారన్నారు. ఆస్తులు పెంచుకోవడమే పనిగా పెట్టుకున్న ఆయనను ఎవరు నమ్మడం లేదన్నారు.

తెలంగాణ అభివృద్ధిపై చర్చకు రమ్మంటే పారిపోయాడన్నారు. చర్చకు చేతగాక ఫాంహౌస్‌లో పడుకున్నారన్నారు. అమెరికాలో ఉన్న కొడుకును రాష్ట్రానికి ఎందుకు తీసుకొచ్చావని, కొడుకు కోసం అసలైన ఉద్యమకారులను తొక్కి పెట్టారని ఆరోపించారు. కెసిఆర్ నాడు చేసింది దొంగ దీక్ష అన్నారు. కాంగ్రెసు, తెరాస మోలాల వల్లే ఆత్మహత్యలు జరిగాయన్నారు.

కెసిఆర్ కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరు చనిపోలేదన్నారు. శంకరమ్మకు సిద్దిపేట సీటును ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. పిడమర్తి రవికి సిరిసిల్ల సీటు ఇందుకివ్వలేదన్నారు. హరీష్ రావు హుజూర్ నగర్ నుండి పోటీ చేసి గెలుపొందాలని సవాల్ చేశారు. కెసిఆర్ చేయని మోసం లేదన్నారు. తెరాసతో కలిసేందుకు ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదన్నారు.

తెరాసకు రాజకీయ వ్యభిచారం చేసే గుణముందని, దానిని చిత్తుగా ఓడించాలన్నారు. టిడిపిని ఆంధ్రా పార్టీ అంటున్న కెసిఆర్ తన కొడుక్కి ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టారన్నారు. కెసిఆర్ మంత్రిగా పని చేసినప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదన్నారు. గెలిచే స్థానాలను కుటుంబ సభ్యులకు ఇచ్చి, ఓడిపోయే స్థానాలను విద్యార్థులకు, అమరవీరుల కుటుంబాలకు ఇచ్చారన్నారు. కాగా, పొత్తులతో ఇబ్బంది లేని సీట్లను తాము ఈ రోజురాత్రి ప్రకటిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+