ఎర్రబెల్లిపై తేనేటీగల దాడి: బయటపెడ్తా: కెసిఆర్‌కు దానం
హైదరాబాద్/వరంగల్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు పైన తేనె టీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఎర్రబెల్లి రాయపర్తి మండలం రాగన్నగూడెం గ్రామంలో ప్రచారం చేస్తున్న సమయంలో తేనెటీగలు దాడి చేశాయి.
మహీధర్ రెడ్డితో మేకపాటి భేటీ
మాజీ మంత్రి మహీధర రెడ్డితో నెల్లూరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి సోమవారం ఉదయం సమావేశమయ్యారు. ఎన్నికల్లో పోటీ చేయనందున తమ పార్టీకి మద్దతివ్వాలని మహీధర్ రెడ్డిని మేకపాటి కోరినట్లుగా సమాచారం.

తెలంగాణకు పట్టిన శని: దానం
తెలంగాణకు పట్టిన శని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని మాజీ మంత్రి దానం నాగేందర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దానం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమం చేసింది కెసిఆర్ కాదని ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులని ఆయన అన్నారు. నిమ్స్‌లో కెసిఆర్ చేసిన దీక్ష లోగుట్టు బయటపెడతానని హెచ్చరించారు. తెలంగాణలో కెసిఆర్‌ను ఎవరూ నమ్మరన్నారు.












Click it and Unblock the Notifications