టీఆర్ఎస్ నేతలపై తిరగబడ్తారు: ఎర్రబెల్లి, అది కమిషన్ కాకతీయ: యాష్కీ
హైదరాబాద్/ కరీంనగ్/ నిజామాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నేతలపై ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని తెలంగాణ తెలుగుదేశం శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ఎర్రబెల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎర్రబెల్లి పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, ఇతర నేతలు పాల్గొన్నారు.

రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రమేష్ రాథోడ్ అన్నారు. ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. శనివారం నాడు టీడీపీ జిల్లా మహాసభలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.
వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయలో అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాదయాత్రతో రాష్ట్ర రైతులకు ఒరిగిందేమీ లేదని అన్నారు. కరీంనగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు విజయ రమణారావు మాట్లాడుతూ - తెలంగాణ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులను ప్రజా కోర్టులో నిలబెడతామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయగా మారిందని తెలంగాణ కాంగ్రెస్ నేత మధుయాష్కి ఆరోపించారు. శనివారం నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదు శాతం కమీషన్ వసూలు చేస్తున్నారన్నారు. ఆంధ్రా సాకుతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి గొంతు నొక్కినట్లు తమ గొంతు నొక్కొలని చూస్తే ఊరుకునేది లేదని మధుయాష్కి స్పష్టం చేశారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications