వదలం: కెసిఆర్‌కు ఎర్రబెల్లి, టీడీపీపై చేతులెత్తేసిన హరి!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు గురువారు నిప్పులు చెరిగారు. కెసిఆర్ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే వదిలేది లేదని హెచ్చరించారు.
ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చకుంటే ఆయనను తాము నిలదీస్తామన్నారు. కొద్ది రోజులు ఆగితే కెసిఆర్ మోసాలు, దగాను ప్రజలు గుర్తిస్తారన్నారు టిడిపి ప్రభుత్వం కోసం ప్రజలు వేచి చూసే పరిస్థితి వస్తుందన్నారు.

రాజధానిపై స్పష్టత ఉంది: హరిబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని పైన భారతీయ జనతా పార్టీకి స్పష్టత ఉందని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, విశాఖ ఎంపీ హరిబాబు గురువారం వేరుగా అన్నారు. రైతు రుణమాఫీలో కేంద్రం జోక్యం చేసుకోదని చెప్పారు. రుణమాఫీ అనేది టీడీపీ ఇచ్చిన వాగ్దానమని చెప్పారు.
కేంద్రం నుండి ఎక్కువ నిధులు వచ్చేలా తాము కృషి చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పటిష్టతకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధిని వికేంద్రీకరించాలనేది తమ అభిప్రాయం అన్నారు.












Click it and Unblock the Notifications