అర్ధరాత్రి బుల్లెట్‌పై టి మంత్రి షికారు!: కెసిఆర్‌పై ఎర్రబెల్లి

Errabelly fires at KCR
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి పద్మారావు గౌడ్ తన సరదాతో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. తన చుట్టూ ఉన్న భద్రత సిబ్బందిని వదిలేసి, ఓ రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిల్‌పై షికారు బయల్దేరారు. ఆదివారం అర్ధరాత్రి వేల పంజాగుట్ట- సికింద్రాబాద్ రోడ్డుపై మంత్రి పద్మారావు దూసుకెళ్లారు.

పార్టీ కార్యకర్తల కోరిక మేరకే ఆయన బుల్లెట్ వాహనాన్ని నడిపినట్లు తెలిసింది. ఆయన వెంట పలువురు కార్యకర్తలు కూడా ర్యాలీ మాదిరిగా బయల్దేరారు. తాను నడుపుతున్న బుల్లెట్ వాహనం వెనక ఓ కార్యకర్తను కూర్చోబెట్టుకున్న మంత్రి ఉత్సాహంగా బుల్లెట్ నడిపారు.

తగాద ఎందుకు: ఎర్రబెల్లి

కేంద్రంతో తగాదులు ఎందుకు పెట్టుకుంటున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. భావోద్వేగాలు రెచ్చగొట్టి పాలన చేయాలనుకోవడం సరికాదని ఆయన సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేటలో ఎండిపోయిన పంటలను ఎర్రబెల్లి, ఇతర తెలుగుదేశం నాయకులు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సొంత జిల్లాలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులను కూడా రాష్ట్ర మంత్రులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన కెసిఆర్.. ఇప్పుడు అనేక కొండీలు చెబుతున్నారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+