టీ హోం మంత్రి ఈటెల: ఇంటిలిజెన్స్‌కు శివధర్ రెడ్డి?
హైదరాబాద్: తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు తన మంత్రివర్గ కూర్పుపై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ హోం మంత్రిగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ శాసనసభ్యుడు ఈటెల రాజేందర్ పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈటెల రాజేందర్ కెసిఆర్‌కు అత్యంత సన్నిహితుడు.
తెలంగాణ ఉద్యమం సమయంలో కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు ఈటెల రాజేందర్ కీలక పాత్ర పోషించారు. కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఎదురు తిరిగినప్పుడు వారిని సముదాయించి చల్లబరిచారని అంటారు. దీక్ష విరమించినట్లు వార్తలో రావడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఒక్కసారిగా కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.

ఇదిలావుంటే, తెలంగాణ ఇంటలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. విశాఖఫట్నం కమిషనర్‌గా ఉన్న శివధర్ రెడ్డిని బదిలీ చేస్తూ డిజిపి కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. హైదరాబాద్‌లోని ఇంటలిజెన్స్ కార్యాలయానికి రావాల్సిందిగా ఆయనకు ఆదేశాలు వెళ్లాయి. శివధర్ రెడ్డి కెసిఆర్‌కు సన్నిహితులు. దీంతో ఇంటలిజెన్స్ విభాగానికి కెసిఆర్ ఆయనను చీఫ్‌గా ఎంపిక చేసుకున్నట్లు చెబుతున్నారు.
తన సిఎం పేషీ కూర్పులో కెసిఆర్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తనకు కావాల్సిన అధికారులను కేంద్ర ప్రభుత్వం నుంచి బదిలీ చేయించుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఆయన నర్సింగరావును, రాజశేఖర్ రెడ్డిని, గోపాల్ రెడ్డిని రప్పించాల్సిందిగా ఆయన గవర్నర్‌ను కోరారు.












Click it and Unblock the Notifications