మా నితిన్ పెళ్లికి రావాలి: చంద్రబాబును కలిసిన టీ మంత్రి ఈటెల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కలిశారు. శుక్రవారం ఉదయం గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబును కలిసిన ఈటెల.. తన కుమారుడు నితిన్ వివాహానికి హాజరు కావాల్సిం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కలిశారు. శుక్రవారం ఉదయం గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబును కలిసిన ఈటెల.. తన కుమారుడు నితిన్ వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు.
ఈటెల కుమారుడు నితిన్ పెళ్లి జూన్ 18న హైదరాబాద్ నగరంలోని హైటెక్స్‌లో జరగనుంది. ఈ క్రమంలో మంత్రి ఈటెల రాజేందర్ ప్రముఖులను ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు.

ఈటెల కుమారుడి పెళ్లికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వస్తే.. మరోసారి ఒకే వేదికపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో వేదిక పంచుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications