ఎథిక్స్ కమిటీ నిర్ణయంతో.. సుజనాకు చుక్కలేనా..!
అధికార దుర్వినియోగానికి నిలువెత్తు నిదర్శనంగా మారిపోయారు కొంతమంది ప్రజాప్రతినిథులు. చట్ట సభల్లో కూర్చుంటూనే యథేచ్చగా తమ వ్యాపార ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. సామాన్యులెవరైనా లక్ష రూపాయల అప్పు చెల్లించకపోతేనే అంతెత్తున ఎగిరే బ్యాంకులు, వేల కోట్గ రూపాయల కుచ్చు టోపీ పెడుతున్న వీళ్ల పట్ల మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చట్టం చేతుల్లో నుంచి తప్పించుకోవచ్చనేది సదరు నేతల ఆలోచన అయి ఉండొచ్చు.

తాజాగా కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా భాగోతం బయటపడ్డాక.. ఆయన్ను రాజ్యసభ సభ్యత్వం నుంచి తప్పించాలనే వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను చట్ట సభల్లో కొనసాగనిస్తే ప్రజలకు చట్ట సభలపై ఉన్న గౌరవం దెబ్బ తింటుందని భావించిన ఎథిక్స్ కమిటీ ఇప్పుడు ఈ అంశంపై ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఇదే గనుక నిజమైతే.. టీడీపీ నేత కేంద్రమంత్రి సుజనా చౌదరికి కూడా తిప్పలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రుణాల ఎగవేత జాబితాలో ఆయన పేరు కూడా ఉన్న విషయం తెలిసిందే. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించడంలో విఫలమైన డీఫాల్టర్లను చట్టసభల్లో అడుగుపెట్టనివ్వకుండా ఉండడానికి కొత్త చట్టాన్ని సిఫారసు చేయాలనే ఆలోచనలో ఎథిక్స్ కమిటీ ఉన్నట్టుగా సమాచారం. ఒక్క సుజనా చౌదరికే గాక ఇలాంటి కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఎంపీలందరికీ ఈ చట్టం చెంపపెట్టుగా మారనుంది.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications