నిమిషానికి 10వేలు: విశాఖలో నైతిక విలువల కమీటీ భేటీ (ఫోటోలు)
హైదరాబాద్: ఏపీ శాసనసభా సమావేశాల్లో నిమిషానికి రూ. 10 వేలు ఖర్చు అవుతుందని, సమావేశాలు సక్రమంగా సాగకపోవడంతో ప్రజాధనం వృధా అవుతోందని నైతిక విలువల కమీటీ సమావేశంలో పలువురు మేధావులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
సోమవారం విశాఖపట్నంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ నేతృత్వంలో నైతిక విలువల కమిటీ రిషికొండలోని గెస్ట్ హౌస్‌లో సమావేశమైంది. ఈ సమావేశంలో స్పీకర్ అధ్యక్షతన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

విశాఖలో నైతిక విలువల కమీటీ భేటీ
అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగక్కుండా ఆటంకాలు సృష్టించే వారిపై చర్యలు కఠినంగా ఉండాలని, సభ స్తంభించడానికి కారకులైన వారికి ఇచ్చే రోజు వారీ భృతిలో కోత విధించాలని నైతిక విలువల కమిటీకి సూచించారు. విశాఖలో వివిధ రంగాలకు చెందిన 30 మంది మేధావులు ఈ సూచనలను అందించారు.

విశాఖలో నైతిక విలువల కమీటీ భేటీ
సమావేశం అనంతరం స్పీకర్ కోడెల మీడియాతో మాట్లాడారు. విజయవాడ, తిరుపతిలలో కూడా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి, సూచనలను క్రోడీకరిస్తామని చెప్పారు. కొంతమంది శానససభ సభ్యులు సభను అడ్డుకుంటామని ముందుగానే ప్రకటించి అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు కేవలం 38 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే తమ ఆస్తుల వివరాలను సమర్పించాలని తెలిపారు.

విశాఖలో నైతిక విలువల కమీటీ భేటీ
అసెంబ్లీలోని శాసనసభ్యులు అన్ని అంశాలపై మంచి పట్టు సాధించి రావాలని చెప్పిన ఆయన, కొంతమంది ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని చెప్పారు. స్పీకర్‌ను సైతం కించపరుస్తూ మాట్లాడుతున్నారని వాపోయారు. ఈసారి ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను విశాఖపట్నంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక మరియు అసెంబ్లీ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాకు తెలిపారు.

విశాఖలో నైతిక విలువల కమీటీ భేటీ
ఈనెల 31 నుండి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశం ఎక్కడైనా నిర్వహించడానికయినా పెద్దగా ఇబ్బంది, ఖర్చు ఉండదు. కానీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు మాత్రం చాలా భారీ ఏర్పాట్లు, తదనుగుణంగానే భారీ వ్యయం అవసరమవుతుంది.












Click it and Unblock the Notifications