నేడు యథావిధిగా గ్రూప్ 2 మెయిన్స్.. సర్వం సిద్ధం !

ఏపీలో తీవ్ర ఉత్కంఠకు తెరలేపిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నేడు యథావిధిగా జరగనుంది. అసలు పరీక్ష జరుగుతుందా లేదా అని గందరగోళంలో ఉన్న అభ్యర్ధులకు ఏపీపీఎస్సీ క్లారిటీ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 175 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. మెయిన్స్ పరీక్షకు 92,250 మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉండనుంది. సోషల్ మీడియాలో ఎవరైనా గ్రూప్‌-2 పరీక్షలపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

everything is ready for Today group 2 mains exam

గ్రూప్- 2 మెయిన్స్‌ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రేపు నిర్వహించాల్సిన . రోస్టర్ తప్పుల సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్ధుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి.. దీంతో, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి లేఖ రాసింది.. . ఒక వైపు గ్రూప్- 2 అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు.. గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనలను గుర్తించి ఏపీపీఎస్సీకి లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. అయితే, ఏపీపీఎస్సీ దీనిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో.. అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.. చివరకు, గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలన్న ప్రభుత్వ లేఖకు ఏపీపీఎస్సీ కార్యదర్శి తిరిగి లేఖ రాసినట్టుగా తెలుస్తోంది.

పరీక్ష నిర్వహణపై శనివారం నాడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గ్రూప్‌-2 నోటిఫికేషన్‌లో మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, క్రీడాకారులకు ప్రత్యేక రోస్టర్‌ పాయింట్లను నిర్ధారించడాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే పరీక్ష కొద్ది రోజులు వాయిదా వేయాలని కోరుతూ ఏపీపీఎస్సీ సెక్రటరీకి ప్రభుత్వం లేఖ రాసింది. రోస్టర్ అంశంపై ప్రస్తుతం కోర్టులో పిటిషన్‌పై విచారణ సాగుతోందని.. వచ్చే నెల 11వ తేదీన మరో మారు విచారణ జరగనుందని వెల్లడించింది.

కోర్టులో ఉన్న ఈ అంశంపై అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉందని అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయం తీసుకోలేమని ఏపీపీఎస్సీ తేల్చి చెప్పింది. దీంతో పరీక్షను యథావిధిగా నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+