వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాంకర్ మాట: రేవంత్ బాస్‌పై ఆరా, తేదీ సమయమూ రికార్డు?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యుడు స్టీఫెన్ సన్‌తో మాట్లాడినప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యడు రేవంత్ రెడ్డి బాస్ అనే మాటను రెండు మూడు సార్లు ఉపయోగించారు. ఆ బాసెవరో తెలుసుకోవడానికి ఆ మధ్య రేవంత్ రెడ్డి ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూను ప్రాతిపదికగా తీసుకోవడానికి ఎసిబి అధికారులు ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

తమ బాస్ అంటూ ఆ ఇంటర్వ్యూలో అన్నప్పుడు యాంకర్ చంద్రబాబు అంటూ ఆ బాస్‌ను ధ్రువీకరించడానికి ప్రయత్నించారు. దాన్ని ఆసరా తీసుకని రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం ద్వారా బాస్ అని ఎవరిని సంబోధించారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారని అంటున్నారు.

రేవంత్ రెడ్డిని కస్టడీకి తీసుకున్న తర్వాత విచారించడానికి తగిన ప్రశ్నావళిని కూడా ఎసిబి రూపొందించినట్లు తెలుస్తోంది. వాటికి రేవంత్ రెడ్డి సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వకపోతే ఆయనను ఉక్కిరిబిక్కిరి చేయడానికి తగిన ఆధారాలు చూపించి ప్రశ్నలను సంధించాలని ఎసిబి అధికారులు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంటర్వ్యూలో యాంకర్ చెప్పిన మాటను కూడా రేవంత్ రెడ్డికి ఆ సమయంలో వినిపించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Evidences on Revanth reddy's boss?

ఇదిలావుంటే, స్టీఫెన్ సన్ ఎసిబికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయకముందే రేవంత్ రెడ్డికి వల వేసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) వైపు నుంచి నిఘా వేసినట్లు వార్తలు వచ్చాయి. అంతకు ముందు జరిగిన టెలిఫోన్ సంభాషణల టేపులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి దొరికిపోవడం పక్కా అని నిర్ధారించుకున్న తర్వాతనే స్టీఫెన్ సన్ ఎసిబికి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.

దాడులు చేసే సమయంలో ఎసిబి కెమెరాలు ఏర్పాటు చేయడం సర్వసాధారణం. కానీ, రేవంత్ రెడ్డిని పట్టుకునే విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరించారు సమయం, తేదీ కూడా రికార్డు అయ్యే విధంగా గట్టి చర్యలు తీసుకున్నారు. రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన వెంటనే న్యూస్ చానెళ్లకు వీడియోలో లీక్ కావడం కూడా వ్యూహంలో భాగమేనని అంటున్నారు.

ఎసిబికి చిక్కిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి మీసం మెలేయడం, కెసిఆర్‌ను కుర్చీ నుంచి దించేస్తానని, బట్టలు విప్పించి కొట్టిస్తానని అనడం వంటి విషయాలను తెలంగాణ ప్రభుత్వ పెద్దలను మరింతగా రెచ్చగొట్టాయని అంటున్నారు.

English summary
It is said that ACB is taking the interview of Revanth Reddy given to a news channel to find out the boss mentioned in video footage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X