నేడు బీజేపీలోకి మాజీ సీఎం కిరణ్ - బంపరాఫర్..!!

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆయన బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. నల్లారి కుటుంబం సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లో ఉంది. రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్.. రాష్ట్ర విభజన జరగదంటూ చివరి వరకు చెప్పుకొచ్చారు. విభజన పూర్తయిన తరువాత సీఎం పదవికి..కాంగ్రెస్ కు రాజీనామా చేసారు. సొంత పార్టీ ఏర్పాటు చేసిన ఆయన 2014లో ఒక్క సీటు గెలుచుకోలేదు. తిరిగి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

అయినా, క్రియాశీలక రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కిరణ్..ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారు. కిరణ్ సేవలను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వినియోగించుకోవాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. తెలంగాణలో కిరణ్ పైన రాష్ట్ర విభజన వ్యతిరేకించారనే కారణంతో వ్యతిరేకత ఉంది. తెలంగాణ బీజేపీ నేతలు పార్టీ వ్యవహారాల్లో కిరణ్ జోక్యం ఎంత వరకు అంగీకరిస్తారనేది సందేహమే. ఇక ఏపీలో ఎన్నికలకు బీజేపీ సిద్దం అవుతున్న వేళ కిరణ్ కు ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తారనేది ఆసక్తి కరంగా మారింది.

 kirankumarreddy

జగన్ కాంగ్రెస్ ను వీడి పార్టీ ఏర్పాటు సమయం నుంచి కిరణ్ తో రాజకీయ వైరం మొదలైంది. జగన్ పైన కేసుల విషయంలో కిరణ్ కూడా కీలకంగా వ్యవహరించారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక, కిరణ్ ప్రభుత్వం పైన నాడు అవిశ్వాసం పెట్టిన సమయంలో టీడీపీ సహకరించి, ఆయన ప్రభుత్వాన్ని కాపాడిందనేది వైసీపీ నేతల వాదన. 2014 ఎన్నికల్లో పరోక్షంగా కిరణ్ తన పార్టీ అభ్యర్దుల ద్వారా టీడీపీకి మేలు చేసారనే అభిప్రాయం ఉంది. ఈ సమయంలో ఇప్పుడు బీజేపీలో చేరటం ద్వారా రాష్ట్రంలో రానున్న రోజుల్లో కిరణ్ కు ఎన్నికల నాటికి కీలక బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. కిరణ్ కు రాజ్యసభ సీటు పైన హామీ ఇచ్చినట్లు సమాచారం.

సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లో పని చేసిన నల్లారి కుటుంబం నుంచి కిరణ్ సోదరుడు కిషోర్ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పీలేరు టీడీపీ అభ్యర్ధిగా కిషోర్ పోటీ చేయనున్నారు. ఇటు టీడీపీ-జనసేన- బీజేపీ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విధంగా చంద్రబాబు, పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నేతలు ఇప్పటి వరకు అందుకు సుముఖంగా లేరు. ఇక, తెలుగు రాజకీయాలపైన పూర్తి పట్టు ఉన్న కిరణ్ బీజేపీలో చేరటం ద్వారా కొత్త వ్యూహాలు తెర పైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. పార్టీలో చేరిన తరువాత కిరణ్ తన భవిష్యత్ లక్ష్యాలు స్పష్టం చేసే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+