Unstoppable: 3 రాజధానులపై 'నల్లారి' షాకింగ్ కామెంట్స్?

Unstoppable:నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అన్ స్టాపబుల్ రెండోసీజన్ ప్రారంభమైంది. నాలుగో ఎపిసోడ్ కు ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, నటి రాధిక అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ అడిగిన పలు ప్రశ్నలకు నల్లారి సమాధానాలిచ్చారు. ఏపీలో మూడు రాజధానులను సమర్థిస్తారా? ఒక రాజధానికే మద్దతిస్తారా? అని బాలకృష్ణ అడిగారు.

అన్నీ ఒకచోట ఉంటేనే సౌలభ్యం

అన్నీ ఒకచోట ఉంటేనే సౌలభ్యం


అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు అని, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్ మూడూ ఒకే చోట ఉంటేనే సౌలభ్యంగా ఉంటుందని కిరణ్ కుమార్ రెడ్డి సమాధానమిచ్చారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో అధికారులు అక్కడికి రావాల్సి ఉంటుందన్నారు. అలాగే కేబినెట్, సెక్రటేరియట్‌కు సంబంధించిన అధికారులు కూడా శాసనసభకు రావాల్సి ఉంటుందని నల్లారి గుర్తు చేశారు. 'ఇప్పుడున్న లిటిగేషన్స్‌తో.. కోర్టులో ఏ కేసు వేయాలన్నా అధికారులు ముఖ్యమంత్రులు, మంత్రుల దగ్గర అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే దీన్నిబట్టి మూడూ ఒకేచోట ఉంటే సౌలభ్యంగా ఉంటుందని స్పష్టం చేశారు.

విభజన తీవ్రంగా బాధించింది

విభజన తీవ్రంగా బాధించింది


రాష్ట్ర విభజన సమయంలో చాలా బాధకు గురైనట్లు కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. 'నా అభిప్రాయం ప్రకారం విభజన జరిగితే తెలుగువారు విడిపోతారు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చాలా దగ్గర సంబంధాలున్నాయి.. రాష్ట్రం విడిపోవడంవల్ల వారికి మేలు జరగదు.. వారికి ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంలోనే అప్పుడున్నట్లు వివరించారు. తెలుగుదనం అనేది అందరూ కలిసివుంటేనే మనకు బలమని నమ్మి ఆరోజు తాను ఉమ్మడి రాష్ట్రానికే ఓటేసినట్లు తెలిపారు.

ప్రజలంతా సంతోషంగా ఉన్నారు

ప్రజలంతా సంతోషంగా ఉన్నారు


విభజన జరిగిన తర్వాత ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. తన తండ్రి 50 సంవత్సరాలకే మరణించారని, కొన్నిరోజులు బాధపడినప్పటికీ యథావిధిగా రోజువారీ కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందని, దాంతో బాధను మరిచిపోతామన్నారు. అలాగే రాష్ట్ర విభజన తాలూకు గాయం కూడా నెమ్మదిగా మానుతుందన్నారు. తాను పుట్టింది, పెరిగింది, చదివింది హైదరాబాద్ లోనేనని, ఇప్పుడు నివసించేది కూడా హైదరాబాద్ లోనేనన్నారు. తనకు 53 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఈ ప్రాంతం వాడిని కాదనే భావన తనను తీవ్రంగా బాధించిందన్నారు. . విభజన నాటి అంశాలు, మూడు రాజధానులు, జాతీయ పార్టీల ప్రస్తావన, ముఖ్యమంత్రి అవడానికి ముందున్న పరిస్థితులను వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+