అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం..మంత్రులు వాటి విశ్వసనీయత దెబ్బ తీసారు:న్యాయస్థానాల్లో ఇబ్బందులే: ఐవైఆర్ కీలక వ్యాఖ్యలు..!

|
Google Oneindia TeluguNews

శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన..అధికార వికేంద్రీకరణ ను స్వాగతించిన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..బీజేపీ నేత ఐవైఆర్ క్రిష్టారావు..కీలక వ్యాఖ్యలు చేసారు. తాజా పరిస్థితుల పైన ప్రభుత్వానికి హెచ్చరిక చేసారు. ప్రభుత్వం రాజధానుల పైన ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ...బోస్టన్ కమిటీలు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు అందించాయి. వీటిని అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. అయితే, ముఖ్యమంత్రి జగన్...మంత్రులు ముందుగానే చేస్తున్న ప్రకటనలకు అనుగుణంగానే కమిటీ నివేదికలు ఉండటం ద్వారా కమిటీ విశ్వసనీయతను దెబ్బ తీశాయని ఐవైఆర్ వ్యాఖ్యానించారు. ఇది న్యాయస్థానాల్లో ఇబ్బందికర పరిణామాలు కలుగ చేయవచ్చని అభిప్రాయపడ్డారు. దీని పైన ఇప్పుడు అధికార..రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

విశ్వసయతను దెబ్బతీసారంటూ..
ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి..బీజేపీ నేత ఐవైఆర్ క్రిష్టారావు చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు రాజకీయంగానూ..అధికార వర్గాల్లోనూ చర్చకు కారణమైంది. రాజధాని తరలింపు ప్రతిపాదనల పైన ప్రభుత్వ వేగంగా అడుగులు వేస్తుంటే..ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో తొలి నుండి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించిన ఐవైఆర్ ఇప్పుడు కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన తన ట్విట్టర్ ద్వారా ...జిఎన్ రావు కమిటీలో ని అంశాలను ముఖ్యమంత్రి గారు ముందే ప్రస్తావించారు. బీసీజీ కమిటీ అంశాలను మంత్రులు ముందే ప్రస్తావించారు. ఈ నివేదికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ పై చర్యలు కమిటీల విశ్వసనీయతను దెబ్బతీశాయి. రేపు న్యాయస్థానాలలో ఇవి ఇబ్బందికర పరిణామాలను కలుగ చేయవచ్చు...అంటూ చేసిన ట్వీట్ పైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. రాజధాని తరలింపుకు ప్రాతిపదిక అయిన కమిటీ నివేదికల పైన న్యాయపరంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ex CS IYR key comments on CM and minsters comments on capital shifting and committee reports

సీఎం..మంత్రులు ముందుగానే వ్యాఖ్యలు..
అసెంబ్లీ శీతాకాల సమావేశాల ముగింపు రోజున ముఖ్యమంత్రి మూడు రాజధానులు ఉండవచ్చంటూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో తాము నియమించిన రెండు కమిటీ నివేదికలు వచ్చిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. సీఎం చెప్పిన విధంగానే జీఎన్ రావు కమిటీ నివేదిక..అదే విధంగా బోస్టన్ నివేదికలో సిఫార్సులు ఉన్నాయి. ఇప్పుడు వీటి పైన ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నా యి.

ముఖ్యమంత్రి చెప్పిన విధంగానే కమిటీలు సిఫార్సులు చేసాయని..వీటికి విలువ లేదని వ్యాఖ్యానిస్తున్నాయి. రాజధాని తరలింపు న్యాయ పరంగా సాధ్యం కాదని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు ఇదే సమయంలో ఐవైఆర్ అదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఇప్పటి వరకూ..అన్ని నిధులను ఒకేచోట కేంద్రీకరించే ప్రయత్నం అంతరాలు పెరగటానికి తోడ్పడి భిన్న ప్రాంతాల మధ్య సందేహాలకు ద్వేషానికి తావిస్తుందని చెబుతూ వచ్చిన ఆయన..ఇప్పుడు సీఎం..మంత్రుల వ్యాఖ్యల కారణంగా న్యాయ పరంగా ఇబ్బంది కర పరిణామాలను కలగచేయవచ్చంటూ వ్యాఖ్యానించారు. దీంతో.. ఏం జరిగే అవకాశం ఉందనే చర్చలు ఆసక్తి కరంగా సాగుతున్నాయి.

English summary
ex CS IYR key comments on CM and minsters comments on capiyal shifting and committe reports. He saying that CM and ministers opinion and committees reccomandations is same. It may create legal problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X