మైత్రి మూవీ మేకర్స్ లో బాలినేని పెట్టుబడులు - తేల్చేసారు..!!
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ లో పెట్టుబడుల పై రాజకీయ వివాదం కొనసాగుతోంది. మాజీ మంత్రి బాలినేని పైన కొనసాగుతున్న ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి స్పందించారు. నందమూరి బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాలో బాలినేని పెట్టుబడులు పెట్టారని జనసేన నేత ఆరోపించారు.
దీని పైన స్పందించిన బాలినేని అసలు విషయం తేల్చి చెప్పారు. సినీ ఇండస్ట్రీలో తనకు దిల్ రాజు వంటి చాలా మంది స్నేహితులు ఉన్నారని చెప్పారు. వీరసింహారెడ్డి సినిమాకే కాదు ఏ సినిమాకు అయినా అవసరం అయితే సహకరిస్తానని స్పష్టం చేసారు.

ఏపీ మాజీ మంత్రి..వైసీపీ ముఖ్య నేత బాలినేని శ్రీనివాస రెడ్డి సినీ ఇండస్ట్రీలో పెట్టుబడుల పై చర్చ సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ లో బాలినేని పెట్టుబడులు ఉన్నాయని విశాఖపట్నం జనసేన కార్పోరేటర్ ఆరోపించారు. దీని పైన బాలినేని సీరియస్ అయ్యారు.
ఈ ఆరోపణల్లో నిజం లేదన్నారు. తనకు సినీ ఇండస్ట్రీలో దిల్ రాజ్ వంటి మిత్రులు చాలా మంది ఉన్నారని చెప్పుకొచ్చారు. పరిచయాలు ఉంటే పెట్టుబడి పట్టారని ఆరోపణలు చేయటం సరి కాదని చెప్పారు. తాను పెట్టుబడి పెట్టినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని..తన ఆస్తులను రాసిస్తానని బాలినేని సవాల్ చేసారు.
నందమూరి బాలయ్య నటించిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో నిర్వహించేందుకు బాలినేని సహకారం అందించారు. ఆ వేదిక నుంచే సినీ దర్శకుడు గోపీచంద్ ప్రత్యేకంగా బాలినేనికి ధన్యవాదాలు చెప్పారు. ఇప్పుడు జనసేన నేత ఈ వ్యాఖ్యల ఆధారంగానే ఆరోపణలు చేసినట్లు భావిస్తున్నారు.
వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సహకరిస్తే మైత్రీ మూవీస్ లో పెట్టుబడులు పెట్టినట్లా అంటూ బాలినేని ప్రశ్నించారు. వీరసింహారెడ్డి సినిమాకే కాదు ఏ సినిమాకు అయినా అవసరం అయితే సహకరిస్తానంటూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి తేల్చి చెప్పారు.
దీని పైన పవన్ స్పందించాలని బాలినేని డిమాండ్ చేసారు. ఏ నిర్మాతో అయినా తాను పెట్టబడులు పెట్టానా లేదో అడిగి తెలుసుకోవాలన్నారు. ఈ వ్యవహారం పై ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలి.. సంబంధం లేకుండా అభియోగాలు చేస్తున్నారు..
నా రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. పవన్ తమ పార్టీ కార్పోరేటర్ పైన చర్యలు తీసుకోవాలని బాలినేని డిమాండ్ చేసారు. గతంలో బాలినేనిన అభినందించిన పవన్, ఇప్పుడు తాజా డిమాండ్ పైన స్పందిస్తారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
-
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications