డేగలా కన్నేసాడు - మాజీ మంత్రి నారాయణపై సోదరుడి భార్య ఆరోపణలు..!! (వీడియో)
మాజీ మంత్రి..టీడీపీ నేత నారాయణపై ఆయన తమ్ముడి భార్య ప్రియ సంచలన ఆరోపణలు చేశారు. రోజు పొద్దున మొదలు పెడితే సాయంత్రం వరకు తిడుతూనే ఉంటారంటూ అవేదన వ్యక్తం చేసారు. అర్ధరాత్రి వేళ అన్నం తీసుకురాలేదని తనను నారాయణ కొట్టినట్లు ఆమె ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. నవ్వుతూ వీడియో ప్రారంభించిన ప్రియ ఏడుస్తూ వీడియో ముగించారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.
మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య ప్రియ సంచలన ఆరోపణలు చేశారు. నారాయణ ఒక డేగలా తనపై కన్నేశారని ఆరోపించారు. ఓ పిట్టను డేగ ఎత్తుకెళ్లినట్టు తన పరిస్థితి మారిందని చెప్పారు. మోసపోయిన పిట్టను తానేనని వ్యాఖ్యానించారు. నారాయణ తనను చిత్రహింసలకు గురిచేసేవారని చెప్పుకొచ్చారు.

తన తండ్రి ఓ పోలీసు అధికారని..నెల్లూరులోనే పని చేసారని వివరించారు. తమ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు పదే పదే తన సంబంధం గురించి తన తండ్రితో మాట్లాడటం ద్వారా తనకు నారాయణ సోదరుడితో వివాహం జరిగిందని చెప్పుకొచ్చారు. తన భర్త హేచరీస్ బిజినెస్ చేస్తారన్నారు. నారాయణకు ఇద్దరు భార్యలు ఉన్నారని వీడియోలో పేర్కొన్నారు.
నారాయణ తమ్ముడి పేరు మణి. ప్రస్తుతం ప్రియ దంపతులు హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. తనను నారాయణ తీవ్రంగా వేధించేవారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశారు. తన కుటుంబాన్ని కూడా నారాయణ ఇబ్బంది పెట్టారని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో తన కోసం ప్రచారం చేయాలని ఒత్తిడి తెచ్చారని చెప్పారు. పెళ్లైన రోజు నుండి టార్చర్ మొదలైందని వివరించారు.
రోజు పొద్దున మొదలు పెడితే సాయంత్రం వరకు తిడుతూనే ఉంటారంటూ అవేదన వ్యక్తం చేసారు. ఒక రోజు అర్ద్రరాత్రి అన్నం తీసుకు రాలేదని తనను కొట్టారని ఆరోపించారు. ఆ సమయంతో నారాయణ తండ్రి ఆయన్ను మందలించారని వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియో పైన నారాయణ స్పందన తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications