రాజకీయాలకు పేర్ని నాని గుడ్ బై- సీఎం జగన్ ఏం చెప్పారు..!!

వైసీపీ సీనియర్ నేత..మాజీ మంత్రి పేర్ని నాని సంచలన నిర్ణయం ప్రకటించారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్లు సీఎం జగన్ సమక్షంలో ప్రకటన చేసారు. ముఖ్యమంత్రి జగన్ బందరు పర్యటన వేళ జరిగిన సభలో ఈ మేరకు త అభిప్రాయం వెల్లడించారు. కొంత కాలంగా వచ్చే ఎన్నికల్లో పేర్ని నాని పోటీ చేయరని.,.ఆయన కుమారుడు ఎన్నికల బరిలో దిగుతారని ప్రచారం సాగింది. అందుకు సీఎం జగన్ అంగీకరించలేదు. ఇప్పుడు సీఎం సమక్షంలోనే పేర్ని నాని తన నిర్ణయం వెల్లడించారు.

పేర్ని నాని కీలక ప్రకటన : వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని కీలక ప్రకటన చేసారు. తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు బందరులో పర్యటించారు. ఈ సభలో ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న కార్యక్రమాలను పేర్ని నాని ప్రశంసించారు. వయసులో సీఎం జగన్ చిన్నవారని..లేకుంటే పాదాభివందనం చేసేవాడినని వ్యాఖ్యానించారు.

 perninanijagan-

తాను పుట్టిన గడ్డకు ఇంత వైభవం తీసుకువస్తున్నారని సీఎం ను అభినందించారు. ఎప్పుడూ ఏదో ఒక బటన్ నొక్కుతూనే ఉంటారని..ఏదో ఒక వర్గానికి సంక్షేమం అందిస్తూనే ఉంటారన్నారు. చంద్రబాబు పైన పేర్ని నాని విమర్శలు చేసారు. జగన్ తో కలిసి మరో మీటింగ్ ఉంటుందో లేదో తెలియదు అంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.

ముఖ్యమంత్రిపై ప్రశంసలు : చంద్రబాబు హయాంలో కలెక్టరేట్ గబ్బిలాలతో ఉండేదని వ్యాఖ్యానించారు. పాలన అంతా విజయవాడలోనే ఉండేదని..జిల్లా విభజన చేసి బందరును హెడ్ క్వార్టర్ చేశారన్నారు. బందరుకు కళ వచ్చిందని చెప్పుకొచ్చారు. దీని ద్వారా ఎన్నికల్లో పేర్ని నాని గత నుంచి చెబుతున్నట్లుగానే పోటీ నుంచి నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది.

కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి కొడాలి నాని సైతం పరోక్షంగా వచ్చే ఎన్నికల్లో పేర్ని నాని కుమారుడు వైసీపీ నుంచి పోటీ చేస్తారనే సంకేతాలు ఇచ్చారు. తన కుమారుడిని వచ్చే ఎన్నికల్లో బందరు నుంచి పోటీకి అవకాశం ఇవ్వాలని ఇప్పటికే పేర్ని నాని ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. ఈ సారి ఎన్నికల్లో పేర్ని నాని పోటీ చేయాలని.. కుమారుడి సంగతి తాను చూసుకుంటానని గతంలో సీఎం జగన్ హామీ ఇచ్చారు.

వారసుడికి సీటు దక్కేనా : పేర్ని నాని మాత్రం వచ్చే ఎన్నికల్లో తన కుమారుడని బరిలోకి దించేందుకు మొగ్గు చూపారు. ఇప్పటికే ప్రతీ ఇంటికి పేర్ని నాని కుమారుడు తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇంటింటికి తిరిగి ఓటర్లకు దగ్గరవుతున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ప్రతీ సీటును సీఎం జగన్ కీలకంగా భావిస్తున్నారు.

ముఖ్యమంత్రి నుంచి సానుకూలం సంకేతాలతోనే పేర్ని నాని తన కుమారుడిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్..తన సొంత నియోజకవర్గ ప్రజల సమక్షంలోనే పేర్ని నాని తన నిర్ణయం ప్రకటించారు. సీఎం జగన్ నిర్ణయం ఇప్పుడు కీలకం కానుంది. పార్టీకి బలమైన వాయిస్ గా ఉన్న పేర్ని నాని విషయంలో సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిని పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+