Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టచ్‌ చేయండి..ఎలా ఉంటుందో చూస్తార‌ు: వైసీపీ మాజీ మంత్రి వార్నింగ్..!!

టచ్ చేయండి ఎలా ఉంటుందో చూస్తారంటూ టీడీపీ నేతలకు మాజీ మంత్రి కన్నబాబు హెచ్చరిక చేసారు.

టీడీపీ అధినేత చంద్రబాబు..లోకేశ్ పైన మాజీ మంత్రి కన్నబాబు సీరియస్ అయ్యారు. దరిద్రానికి డెఫినిషన్‌ చంద్రబాబు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు, లోకేష్‌లు ప్రవాసాంధ్రులని ఎద్దేవా చేశారు. నారా లోకేష్‌ చేపట్టిన పాదయాత్రకు ప్రజాస్పందన కరువైందని చెప్పుకొచ్చారు. ఒక అజెండా లేకుండా లోకేష్‌ పాదయాత్ర కొనసాగుతోందన్నారు. చంద్రబాబు తాను లేస్తే మనిషిని కాదంటాడు.. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అంటాడు. మాజీ సర్పంచ్ చేత క్లాస్‌ పీకించుకున్నాడు. ఇంత కంటే దరిద్రం ఉంటుందా అని ప్రశ్నించారు. అదే సమయంలో తాము అధికారంలోకి వస్తే వైఎస్సార్ విగ్రహాలను కూలుస్తామని కొందరు టీడీపీ నేతలు చెబుతున్నారని..టచ్ చేయండి ఎలా ఉంటుందో చూస్తారంటూ కన్నబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు.

చంద్రబాబు అధికారంలో ఉంటే వానలు పడవన్నారు. వైయ‌స్ జగన్ అధికారం చేపట్టాక సమృద్ధిగా వానలు కురుస్తున్నాయ‌ని, ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా ఉన్నాయ‌ని చెప్పారు. బాబు పాలనలో కనీసం తాగునీరు కూడా దొరకని పరిస్థితి చూసామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు తనను మించిన మహానటుడు చంద్రబాబు అని స్వయానా ఎన్టీఆరే అన్నారని, చంద్రబాబు మాటలను ఏపీ ప్రజలు నమ్మే స్థితిలో లేరని కన్నబాబు పేర్కొన్నారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తి లోకేష్‌ అని, సీఎం వైయ‌స్‌ జగన్‌ను విమర్శించే స్థాయి లోకేష్‌ ఉందా అని ఎమ్మెల్యే కన్నబాబు ప్రశ్నించారు. పాదయాత్రలో లోకేష్‌ భాష, బాడీలాంగ్వేజ్‌ అసభ్యకరంగా ఉందన్నారు. లోకేష్‌ తన భాషను అదుపులో పెట్టుకుంటే మంచిదని కన్నబాబు సూచించారు. లోకేష్ పాదయాత్రలో తాజాగా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.

Ex Ministers Kurasala Kanna Babu fires on Chandra Babu and Lokesh, Warning for TDP leaders

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపైన కన్నబాబు సీరియస్ అయ్యారు. అయ్యన్నపాత్రుడు స్పృహ ఉండి మాట్లాడుతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ నేతలు భాష, బాడీ లాంగ్వేజ్ విచిత్రంగా ఉంద‌న్నారు. లోకేష్ తో పదో తరగతి పరీక్షలు రాయిద్దామని..పాస్ అవుతారా అంటూ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో నటించడం సీఎం వైయ‌స్ జగన్‌కు చేతకాదన్నారు. జనం గుండె చప్పుడు విని వైయ‌స్ జగన్ గారు పాలన చేస్తున్నారని తెలిపారు. టీడీపీ హయాంలో ఎన్ని శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారో లోకేష్ చెప్పాలని నిలదీశారు. టీడీపీ మాజీ విప్ తాము అధికారంలోకి వస్తే వైఎస్సార్ విగ్రహాలను తీసేస్తామని చెప్పటం పైన స్పందించిన కన్నబాబు టీడీపీకి సవాల్ చేసారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+