Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ తో కలుద్దామనుకున్నా, కానీ - ఉండవల్లి సంచలనం..!!

పవన్ కల్యాణ్ పైన మాజీ ఉండవల్లి అరుణ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఉండవల్లి ఏ పార్టీలోనూ చేరలేదు. మార్గదర్శి తో పాటుగా ఏపీ పునర్విభన కేసు పైన ప్రధానంగా ఫోకస్ చేసారు. రాజకీయంగానూ తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైన ఉండవల్లి పలు సందర్భాల్లో సానుకూల వ్యాఖ్యలు చేసారు. పవన్ సైతం అదే విధంగా ఉండవల్లి గురించి పాజిటివ్ గా స్పందించారు. ఈ సత్సంబంధాల నడుమ ఉండవల్లి ఏమనుకున్నారో, ఎందుకు ఆ ఆలోచన విరమించుకున్నారో వివరించారు.

Ex MP Undavalli Arun Kumar made interesting comments on his support for Pawan Kalyan

ఉండవల్లి అరుణ్ కుమార్ జనసేనకు మద్దితివ్వాలని భావించారు. ఈ విషయం ఆయనే స్వయంగా వెల్లడించారు. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలనే ఏపీకి గత్యంతరంగా మారకూడదని భావించానని చెప్పారు. ఆ సమయంలో తాను పవన్ షైన్ కావాలని కోరుకున్నట్లుగా చెప్పుకొచ్చారు. పవన్ సీఎం అవుతారని తాను అనుకోలేదన్నారు.

పవన్ కూడా తన పైన అభిమానం చూపించారని పేర్కొన్నారు. కొత్త నేతలు రావాలనే ఉద్దేశంతో తాను కొన్ని టిప్స్ పవన్ కు ఇవ్వాలని భావించానని చెప్పారు. కానీ పవన్ రెండు చోట్ల ఓడిపోవటంతో ఆలోచనలు ముందుకు వెళ్లలేదన్నారు. ఇప్పుడు జనసేన కూడా టీడీపీతో కలిసి మార్గదర్శి వ్యవహారంలో రామోజీకి మద్దతు ఇస్తోందని చెప్పుకొచ్చారు.

వైసీపీ పైన వ్యతిరేకతతోనే జనసేన మార్గదర్శికి మద్దతుగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు. టీడీపీ నేతలు తనను టార్గెట్ చేస్తున్నారని, తనకు మార్గదర్శి కేసు వ్యవహారంతో పాటుగా రాష్ట్ర విభజన కేసు మినహా తనకు ఏమీ పని లేదని ఉండవల్లి తేల్చి చెప్పారు. టీడీపీతో చర్చకు తాను అన్ని అంశాల పైన చర్చకు సిద్దమని ఉండవల్లి స్పష్టం చేసారు.

టీడీపీలో హాయంలో ఎవరెవరు స్కాంలు చేసారు..ఎవరిని రక్షించారో.. ఎవరి స్కాంలు ఏంటో చెప్పటానికి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని ఉండవల్లి చెప్పుకొచ్చారు. ఈ మధ్య కాలంలోనే ఉండవల్లి తాను కొంత కాలం జగన్ ప్రభుత్వం పైన విమర్శలు చేయనని కీలక వ్యాఖ్యలు చేసారు. దీని పైన ప్రశ్నించే అర్హత ఎవరికీ లేదన్నారు. టీడీపీ నుంచి ఎవరైనా చర్చకు ముందుకు వస్తే అందుకు తాను సిద్దంగా ఉన్నానని ఉండవల్లి స్పష్టం చేసారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+