వర్మ తీయాల్సింది ఎన్టీఆర్ సినిమా కాదు.. జగన్-420: మంత్రి జవహర్
పాదయాత్ర సందర్భంగా ఎలాంటి అల్లర్లను ప్రేరేపిస్తారో అని జవహర్ అనుమానం వ్యక్తం చేశారు.
విజయవాడ: పాదయాత్రను ఎందుకు చేయబోతున్నారో జగన్ కే స్పష్టతలేదని మంత్రి జవహర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన చేయబోయేది పాదయాత్ర కాదని... పాపపరిహార యాత్ర అని తెలిపారు. ఎప్పుడూ ఏదో ఒక అలజడి సృష్టించే జగన్... పాదయాత్ర సందర్భంగా ఎలాంటి అల్లర్లను ప్రేరేపిస్తారో అని అనుమానం వ్యక్తం చేశారు.

ఎప్పుడూ మాట తప్పను, మడమ తిప్పను అంటూ జగన్ చెబుతుంటారని, అదంతా ఓ మాయ అని జవహర్ విమర్శించారు. ఇక వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావిస్తూ.. రామ్ గోపాల్ వర్మ తీయాల్సింది ఎన్టీఆర్ సినిమా కాదని 'జగన్ 420' పేరుతో సినిమా తీయాలని అన్నారు. మొత్తం మీద వర్మ సినిమాపై టీడీపీ నుంచి ముప్పేటా దాడి మొదలైనట్లుగానే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications