మార్కెట్ లోకి కొత్త మద్యం బ్రాండ్లు - ధరలు ఫిక్స్..!!
మార్కెట్ లోకి కొత్త మద్యం బ్రాండ్లు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు కొత్త మద్యం బ్రాండ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కీలక దశకు చేరింది. ఇందు కోసం దరఖాస్తులను ఆహ్వానించిన అధికారులు తాజాగా గడువు పొడిగించారు. ఇప్పటికే మద్యం ధరల పెంపు ప్రతిపాద నలను ప్రభుత్వానికి సమర్పించిన అధికారులు.. ఏప్రిల్ తొలి వారంలో కొత్త బ్రాండ్ల మద్యం ను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే మద్యం ధరల పైన ఒక అంచనా కు వచ్చినట్లు తెలుస్తోంది.
తాజా నిర్ణయంతో
తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరల పెంపు పైన అధికారుల ప్రతిపాదనల పైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో నూతన మద్యం బ్రాండ్ల కు సంబంధించిన దరఖాస్తులను సమర్పించేందుకు మార్చి 15 వరకు గడువు ఇవ్వగా.. తాజాగా గడువును ఏప్రిల్ 2 వరకు పొడిగి స్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో లేని విదేశీ, దేశీయ లిక్కర్, బీరు కంపెనీలు తమ మద్యం ఉత్పత్తి బ్రాండ్లను అమ్మకాలు జరుపుకునేందుకు వీలుగా.. టీజీబీసీఎల్‌కు 39 కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నాయి. టీజీబీసీఎల్‌లో రిజిస్టర్ కాని కొత్త కంపెనీలు ఇతర రాష్ట్రాల్లో జరుపు న్న తమ మద్యం అమ్మకాలపై నాణ్యత ప్రమాణాలతో అమ్మకాలు జరుపుతున్నట్లుగా.. మద్యం అమ్మకాలపై ఎలాంటి ఆరోపణలు లేవనే నిర్ధారణ సర్టిఫికేషన్ పత్రం దరఖాస్తుతో జత పరచాలని టీజీబీసీఎల్ స్పష్టం చేసింది.

కొత్త బ్రాండ్ల అమ్మకాలతో
టీజీబీసీఎల్ కోరిన విధంగా సర్టిఫికెట్లను జతచేయడానికి సమయం పడుతుండటంతో.. దరఖాస్తు లకు గడువు పెంచాలనే అభ్యర్ధనలు వచ్చాయి. దీంతో, కంపెనీల అభ్యర్ధన మేరకు ఈ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక.. తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో గతంలో ఏపీ వాసులు ప్రముఖ బ్రాండెడ్ మద్యం కొనుగోలు చేసేవారు. తాజాగా ఏపీలో రూ 99 కే మద్యం అందుబాటులో కి రావటంతో ఈ తరహా అమ్మకాలు తగ్గిపోయాయి. ఏపీతో పాటుగా పలు రాష్ట్రాల్లో రూ 99 కే మద్యం అందుబాటులోకి రావటంతో పెరిగిన అమ్మకాలు.. ఆదాయం పైన తెలంగాణ ఎక్సైజ్ శాఖలోనూ చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే మద్యం ధరల పెంపు కోసం అధికారులు ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్నారు. కొత్త బ్రాండ్లు అందుబాటులోకి వచ్చిన తరువాత కొత్త ధరల తో అమ్మకాలు చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
ధరల పై కసరత్తు
ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో తగ్గిన అమ్మకాల కారణంగా రాష్ట్ర మద్యం ఆదాయం దాదాపు రూ 1000 కోట్ల మేర తగ్గినట్లు చెబుతున్నారు. ఇక, తెలంగాణ కంటే ఏపీ రాష్ట్రంలో మద్యం ధరలు అధికంగా ఉన్నాయి. తెలంగాణలో రాయల్ చాలెంజ్ క్వార్టర్ రూ.210, ఫుల్ బాటిల్ రూ.840 ఉంటే, ఏపీలో క్వార్టర్ రూ.230, ఫుల్ బాటిల్ రూ.920గా ఉంది. క్వార్టర్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.80 అదనపు ధర ఉంది. త్వరలోనే రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. క్వార్టర్‌పై రూ.20, బీరుపై రూ.10 ధర పెంచే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఏ బ్రాండ్ మద్యం ధర ఏ మేర పెంచాలనే అంశం పైన వివరాలు సమర్పించారు. ఈ ధరల విషయంలో ప్రభుత్వం ఏ మేర పెంచేందుకు అనుమతి ఇస్తుందనేది స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications