మద్యం ధరల పై పునరాలోచన - ఒకే రేటు, ఇక బార్లలోనూ..!!

ఏపీలో మద్యం అమ్మకాల విషయంలో ఎక్సైజ్ శాఖ కొత్త ప్రతిపాదనలు చేసింది. నూతన బార్‌ పాలసీపై కసరత్తు మొదలు పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన విధానాల్లో మార్పులు సూచిస్తోంది. ఆగస్టుతో ముగియనున్న లైసెన్సుల గడువు ముగియనుంది. ఈ సారి ఫీజులు తగ్గించే యోచన చేస్తోంది. ఆదాయ నష్టం, అక్రమాల్లేని పాలసీ దిశగా కార్యాచరణ సిద్దం చేస్తూనే.. కొత్త ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉంచుతోంది. అందులో భాగంగా మద్యం ధరల పైన పునరాలో చన చేస్తున్నట్లు తెలుస్తోంది.

నూతన పాలసీ
నూతన బార్‌ పాలసీపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పొరపాట్లు లేకుండా పక్కాగా అమలు చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా పలు ప్రతిపాదనలపై అధ్యయనం చేస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం 2022లో వేలం నిర్వహించి బార్లు కేటాయించే విధానం తీసుకొచ్చింది. దాని గడువు ఈ ఏడాది ఆగస్టుతో ముగుస్తుంది. అప్పట్లో రూ.50 లక్షలు, రూ.35 లక్షలు, రూ.15 లక్షలతో మూడు శ్లాబులతో బార్‌ పాలసీ ప్రకటించి.. వేలం నిర్వహించి అత్యధిక ధరకు పాడిన వారికి కేటాయించారు. అంతకుముందు దాదాపు రెండు దశాబ్దాలుగా బార్లను రెన్యువల్‌ చేస్తూ వచ్చారు. దీంతో ప్రభుత్వాలు మారినా లైసెన్సీలు వారే ఉంటూ వచ్చారు. 2022లో వేలం ద్వారా కొత్త లైసెన్సీలను ఎంపిక చేసింది.

excise-officials-latest-proposals-on-bar-policy-and-liquor-rates

ధరల విషయంలో
పలువురు అతి భారీ ధరకు వేలం పాడి బార్లు దక్కించుకున్నారు. రూ.15 లక్షల కనీస ధర ఉన్న బార్‌ను రూ.70 లక్షల వరకు.. రూ.35 లక్షల బార్‌ను రూ.కోటికి పైగా పాడి వేలంలో దక్కించుకు న్నారు. కానీ అంతంత ఎక్కువ ఫీజులతో వ్యాపారంలో నష్టం రావడంతో అనేక మంది మధ్యలోనే లైసెన్సులు వదిలేసుకున్నారు. ఫలితంగా రాష్ట్రంలో ప్రస్తుతం 53 బార్లు ఖాళీగా మిగిలిపో యాయి. దీంతో, బార్లకు కొత్తగా లైసెన్సులు జారీచేయాలా.. ఇప్పుడున్న వారికే రెన్యువల్‌ చేయాలా అనేదానిపై ఆలోచన చేస్తోంది. బార్లకు మళ్లీ కొత్తగా లైసెన్సుల కేటాయింపు అంటే వ్యాపారులు ఎక్కువ మంది ముందుకు రాకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ కొత్త లైసెన్సులు ఇవ్వాల న్న నిర్ణయం తీసుకుంటే.. ఈసారి ఎక్కువ కాలానికి లైసెన్సులు మంజూరు చేయాలనే ప్రతి పాదన కూడా వచ్చినట్లు తెలిసింది. రెన్యువల్‌ కాకుండా కొత్త లైసెన్సులు జారీచేయాలనుకుంటే లాటరీ లేదా వేలంలో కేటాయించాల్సి ఉంటుంది.

Take a Poll

ధరలపై తాజా ఆలోచన

ఇప్పుడు ప్రైవేటు షాపులు రావడంతో వ్యాపారం ఎక్కువ లాభసాటిగా ఉండకపోవచ్చనే అభిప్రాయం బార్ల వ్యాపారుల్లో ఉంది. అందుకే ఈసారి లైసెన్సు ఫీజులు కూడా తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక, మద్యం షాపులు, బార్లకు ఎక్సైజ్‌ శాఖే మద్యం సరఫరా చేస్తుంది. అయితే షాపులతో పోలిస్తే బార్లకు 10 శాతం అదనపు ధరకు విక్రయిస్తుంది. బార్లు, షాపులకు ఒకే ధరకు మద్యం అమ్మాలని మద్యం వ్యాపారులు చాలాకాలం నుంచి డిమాండ్‌ చేస్తున్నారు. కొన్ని చోట్ల బార్‌ వ్యాపారులు షాపుల నుంచి మద్యం తీసుకొచ్చి అక్రమంగా విక్రయిస్తున్నారు. వీటిని అరికట్టాలంటే షాపులు, బార్లకు సరఫరా చేసే మద్యం ధరలు ఒకేలా ఉంచడం మేలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనల పైన మరింతగా కసరత్తు తరువాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+