ఏపీలో మద్యం ధరలు పెంపు - దిద్దుబాటు, ఏ బ్రాండ్ ఎంత..!?
ఏపీలో మద్యం ధరల పెంపు దిశగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఎక్సైజ్ శాఖ ఈ మేరకు కొత్త ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలుస్తోంది. మద్యం లైసెన్సీలకు ఇచ్చే మార్జిన్ విషయంలో తీసుకున్న నిర్ణయాలతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వస్తున్నట్లు అధికారులు గుర్తిం చారు. దీంతో, ఈ నష్టం భర్తీకి ఎంపిక చేసిన మద్యం ధరలు పెంపు దిశగా కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం. ఈ ధరల పెంపు పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
మార్జిన్ నిర్ణయంతో
ఏపీలో మద్యం ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. మద్యం పాలసీ ఖరారులో తీసుకున్న నిర్ణయా లతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతున్నట్లు గుర్తించారు. దీంతో, ఇప్పుడు ఎక్సైజ్ శాఖ దిద్దు బాటు చర్యలు ప్రారంభించింది. లైసెన్సీలకు ఇచ్చే మార్జిన్ పై అధికారుల అంచనాల లెక్క తప్పి నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో లైసెన్సీలకు ఇచ్చే మార్జిన్ సవరణకు ఆమోద ముద్ర వేసారు. దీంతో, ప్రభుత్వ ఖజానా పైన ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఈ సమయంలో వినియోగదారుల పైన కొంత మేర భారం తప్పదనే చర్చ ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు కొత్త ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు.

దిద్దుబాటు చర్యలు
లైసెన్సీలకు ఇచ్చే మార్జిన్ విషయంలో సరైన కసరత్తు జరగలేదనే అభిప్రాయం వినిపిస్తోంది. సీఎం నిర్ణయం మేరకు లైసెన్సీలకు 14 శాతం మార్జిన్ ఇచ్చేలా తాజాగా మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. మద్యం లైసెన్సీలకు ఇష్యూ ప్రైస్‌పై మార్జిన్ ఇస్తారు. ఇష్యూ ప్రైస్, మార్జిన్ కలిపి ఎమ్మార్పీగా అమ్మకాలు జరుగుతాయి. కానీ, మద్యం పాలసీలో ఇష్యూ ప్రైస్‌పై 20శాతం లైసెన్సీ లకు మార్జిన్‌గా ఇస్తామని ఎక్సైజ్‌శాఖ పేర్కొంది. అన్నట్టుగానే ఇస్తోంది. కానీ వాస్తవంగా చూస్తే వారికి 10శాతమే మార్జిన్ వస్తోంది. 20శాతం మార్జిన్ ఇస్తారని భావించిన వ్యాపారులు లాభాలు రాకపోవడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇక, తాజా పరిస్థితుల్లో ప్రభుత్వం కొత్తగా సవరణలు చేస్తోంది.
ధరల పెంపు
మార్జిన్ పెంచటంతో ప్రభుత్వ ఆదాయం తగ్గుతోంది. దీంతో, నష్టం భర్తీ చేసేందుకు ఎక్సైజ్ శాఖ మద్యం ధరల పెంపు పైన ప్రతిపాదనలు చేసింది. ఎమ్మార్పీ రూ.150 దాటిన బ్రాండ్లపై రూ.10 ధర పెంచేలా కొత్త ప్రతిపాదన ప్రభుత్వం ముందు ఉంచింది. అన్ని కేటగిరీల్లోనూ 14 శాతం ఇస్తూ ఈ ప్రతిపాదన అమలు చేయటం ద్వారా రూ 135 కోట్ల మేర ఆదాయం కోల్పోతామని లెక్క వేసింది. ఇక, రూ 99 బ్రాండ్లను మినిహాయించి మిగిలిన అన్ని బ్రాండ్ల పైన రూ 10 వరకు పెంపు ద్వారా 14 శాతం మార్జిన్ ఇచ్చినా రూ 320 కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుందని నివేదికలో పేర్కొంది. రూ 150 దాటిన బ్రాండ్ల పైన రూ 10 వరకు పెంచి మార్జిన్ ను రెండు కేటగిరీల్లో 10.5, 14 శాతం గా అమలు చేయటం ద్వారా రూ 220 కోట్ల ఆదాయం వస్తుందని చెబుతున్నారు. కాగా, ఈ ప్రతిపాదనల పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇందుకు అనుమతిస్తే రూ 99 బ్రాండ్లు మినహా.. ఇతర బ్రాండ్ల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications